Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో హాలీవుడ్ మూవీ లో టాలీవుడ్ హీరో.. ఎవరంటే

Category : movies

రానా దగ్గుపాటి ... విలక్షణ నటుడు .. ఎప్పుడూ ఒకే రకం సినిమాలు తీయడం కాకుండా ప్రతి సినిమాలోనూ ఒక కొత్తదనం చూపించే నటుడు రానా దగ్గుబాటి. 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవుడి గా నటించిన రానా కేవలం సౌత్ ఇండస్ట్రీ లోనే కాక యావత్ ప్రపంచానికి తన గురించి తెలిసేలా చేసుకున్నాడు.

రానా హిందీలో 'హాథి మేరే సాథి' సినిమా మరియు తమిళంలో కొన్ని సినిమాల తో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రానా కి ఒక పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలోనే కాక హాలీవుడ్లో సైతం అడుగుపెట్టనున్నాడు రానా. తాజా సమాచారం ప్రకారం ఒక టీం తో రానా ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

మరి హాలీవుడ్ సినిమాలో రానా హీరో పాత్రలో కనిపిస్తాడా లేక విలన్ పాత్ర పోషిస్తున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో అనిల్ కపూర్ ఇమ్రాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ నటులు ఇంగ్లీష్ తెరపై మెరిసారు. కానీ ఒక తెలుగు హీరో హాలీవుడ్ లో నటించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇంకా వివరాలు బయటకు రానప్పటికీ హాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగు నటుల సత్తా చాటి చెప్పేందుకు రెడీ అయిపోతున్నాడు రానా. తనదైన స్టైల్ లో ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే నటుడు రానా హాలీవుడ్ లో కూడా వెర్సటైల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సాధిస్తారని టాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తుంది.