//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి...!

Category : movies

ప్రముఖ నటుడు, బెనర్జీ తండ్రి రాఘవయ్య గారు ఈ రోజు మృతి చెందారు. రాఘవయ్య మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రాఘవయ్య పార్దీవ దేహాన్ని ఫిలింనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. అంత్యక్రియలను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫిలింనగర్ మహా ప్రస్తానంలో జరపనున్నారు.టాలీవుడ్‌లో నటుడిగా మంచి గుర్తింపు పొందిన రాఘవయ్య.. ‘‘వీరాంజనేయ, కథా నాయకుడు, యమ గోల’’ చిత్రాల్లో నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో కూడా రాఘవయ్య ఓ పాత్రలో నటించారు. ఇదే ఆయనకు చివరి సినిమా.