//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్కూల్ కి వెళుతున్న టాలీవుడ్ కమెడియన్స్...

Category : movies

కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరసగా సినిమాలు చేసుకుంటూ తన పంచ్ ల తో అందరిని నవ్విచే నటుడు వెన్నల కిశోర్ . సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉంటూ తన స్టైల్ తో పంచ్ లు వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. తాజాగా వెన్నల కిశోర్ పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

తాజాగా టాలీవుడ్ కమెడియన్లు అందరూ స్కూలు యూనిఫామ్ లో ఉన్న ఫొటోను కిశోర్ తన ట్విట్టర్ లో షేర్ చేసాడు. మన కమెడియన్లు స్కూలుకు వెళ్లడం ఏంటి? వాళ్లందరూ చిన్నప్పుడు ఓకే స్కూలు లో చదువుకున్నారా? అని ఆచ్చర్యపోతున్నారా. లేదండి వీరంతా స్కూలు యూనిఫామ్ లో థీమ్ పార్టీకి హాజరయ్యారు. బ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ అంటూ ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్‌ వచ్చిందంటూ ట్వీట్‌ చేశాడు వెన్నల కోశోర్. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్‌, రోలర్‌ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్‌లతో పాటు మరికొంతమంది ఉన్నారు.

‘బ్యాక్ టు స్కూల్’ పేరుతో ఈ పార్టీ చేసుకున్న కమెడియన్లు పొట్టి నిక్కర్లు, హాఫ్ షర్టులు, టైతో ఫన్నీగా ఉన్న ఫొటోను కిశోర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కమెడియన్లు సప్తగిరి, ధన్ రాజ్, రోలర్ రఘు, చిత్రం శీను, వేణు వండర్ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. ఈ పార్టీలో వేసుకోవడానికి తనకు చిన్న షార్ట్ వచ్చిందని చెప్పాడు. కాగా, వెన్నెల కిశోర్ పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related News