//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెప్టెంబర్ 20 న టాలీవుడ్ బిజీ బిజీ--కారణాలు ఇవే...

Category : movies

ఈ సెప్టెంబర్20 న టాలీవుడ్ లో కొన్ని కార్యక్రమాల వలన బిజీ బిజీ గా ఉండనుంది.. దానికి కారణం మూడు విశేషాలే కారణం. మొదటిది ఆరోజు మహానటుడు, సర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి 94 వ జయంతి. ఆ రోజున అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని కుటుంబం తో పాటు, స్టూడియో సిబ్బంది ఆయనకి నివాళులు అర్పిస్తారు. అదే విధంగా అక్కినేని అభిమానులు మరియు కొన్ని సంస్థలు ఉభయ రాష్ట్రాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్యహించనున్నారు.

రెండోవది యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ” చిత్రం ఆడియో ఫంక్షన్ సాయంత్రం హై టెక్స్ లోని నోవాటల్ హోటల్ జరగనుంది. అయితే ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా “నటసింహ బాలకృష్ణ” వస్తున్నాడు అన్న వార్తా నందమూరి అభిమానుల ఆనందం అంబరాన్ని తాకుతుంది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్11 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతీ మనకు తెలిసిందే.

ఇక మూడవది బాహుబలి సినిమాతో వరల్డ్ ఫేమస్ అయినా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమౌతాయి. గోపీకృష్ణ మూవీస్ -యూ వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్ముస్తూన్న ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్యం వహిస్తున్నాడు. ఈ మూడు కార్యక్రమాల వలన సెప్టెంబర్ 20 న టాలీవుడ్ బిజీ కానుంది....