నిన్న కశ్మీర్లోని పుల్వామాలో భద్రతా బలగాలపై జరిగిన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.ఈ సంఘటన యావత్ దేశాన్నే శోక సంద్రంలో ముంచింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాల్నే త్యాగం చేసిన జవాన్ల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ.... ఈ దారుణ ఘటనపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఆ ఉగ్రమూకలకు మనసెలా వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరమరణం పొందిన జవాన్లకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు.
*మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన జవాన్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది- సల్మాన్ ఖాన్
*ఎంత దారుణం, ప్రేమికుల రోజు జరుపుకొంటున్న వేళ ఇలాంటి ద్వేషం తలెత్తింది. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి- అభిషేక్ బచ్చన్
*మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలి. చంపిపడేయండి ఆ నా కొడుకులను - పూరీ జగన్నాథ్
*సీఆర్పీఎఫ్ జవాన్ల పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబాలకు నా సంతాపం - సూర్య
*ద్వేషం ఎప్పటికీ సమాధానం కాదు- ప్రియాంక చోప్రా
*మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. పుల్వామా దాడి చాలా బాధాకరం. ఇందుకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి - మంచు మనోజ్
* ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారి కోసం ప్రతీ భారతీయుడు ప్రార్థిస్తుంటాడు. జై హింద్- సోనూ సూద్