//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక్క సినిమాతోనే కనుమరుగైన భామలు

Category : movies

అనురాధ మెహతా

అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆర్య సినిమాతో పరిచయమైంది ఈ భామ.మొదటి సినిమా సూపర్ హిట్ గా నిలిచిన హీరోయిన్ గా నిలదొక్కుకోలేక పోయింది ఈ భామ.

సరః జేన్ దియాస్

ఈ పేరు ఎక్కడ విన్నట్టు లేదు కదా. పంజా సినిమాలో మన పవర్ స్టార్ పవన్ కళ్యణ్ తో ఆడిపాడింది. కానీ ఆ సినిమా విఫలమవడంతో మరో ఆవకాశం దక్కలేదు.

సియా

తెలుగు చిత్ర సీమకు హీరోయిన్స్ ని పరిచయం చేయడంలో మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తరువాతే ఎవరైనా. ఆలా ఇండస్ట్రీ కి పరిచయమైన ఎంతో మంది హీరోయిన్లలో సియా కూడా ఒకత్తి. నేనింతే మూవీ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మా ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది.

గౌరీ ముంజల్

వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన బన్నీ సినిమాలో బన్నీ కి జోడిగా నటించింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది కానీ హీరోయిన్ మాత్రం ప్లాప్ అయ్యింది.

భానుశ్రీ మెహ్రా

ఈ అమ్మడు కూడా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల ద్వారానే పరిచయమైంది. పాపం అల్లు అర్జున్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మళ్ళీ ఎక్కడ కనిపించని పరిస్థితి. అల్లు అర్జున్ వరుడు సినిమాలో వధువుగా కనిపించిన భానుశ్రీ మెహ్రా మళ్ళీ కనిపించలేదు.

మీరా చోప్రా

బంగారం సినిమా తో పరిచయమైన ఈ భామ పవన్ కళ్యాణ్ తో జతకట్టడం తో గుర్తింపు బాగానే వచ్చినప్పటికీ బంగారం ప్లాప్ తరువాత అవకాశాలు మాత్రం రాలేదు.

నేహా శర్మ

ఈ బ్యూటీ ఎంట్రీ క్రెడిట్ కూడా మన పూరి జగన్నాధ్ ఖాతాలోనే. చిరుత సినిమాతో రామ్ చరణ్ , నేహా శర్మ ఇద్దరినీ ఇంట్రడ్యూస్ చేసాడు పూరి. సినిమా సూపర్ హిట్ అయ్యింది. రామ్ చరణ్ స్టార్ అయ్యాడు కానీ నేహా కెరీర్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు.

నేహా బాంబ్

దిల్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నేహా కి మంచి మార్కులే పడినప్పటికీ ఆమె ఖాతాలో సినిమాలు మాత్రం పడలేదు.

నికిషా పటేల్

కొమరం పులి లో పవన్ కళ్యాణ్ తో జత కట్టింది ఈ భామ. నికిషాకు సినిమా రిలీజ్ కాకముందే ఎన్నో ఆఫర్స్ వచ్చి పడ్డాయి. కానీ నికిషా కొమర పులి హిట్ అవుతుంది అన్న ధీమాతో అవేవీ ఒప్పుకోలేదు. తెర సినిమా డిసాస్టర్ అయ్యాక నికిషా వైపు చూసే నాధుడే లేదు. చాలా గ్యాప్ తరువాత కళ్యాణ్ రామ్ ఓం లో కనిపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.