//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక్కో సినిమాకు ఒక్కో లెక్క చెపుతున్న టాలీవుడ్ భామలు .... కోట్లలో రెమ్యునరేషన్ వసూళ్లు చేస్తున్న టాప్ హీరోయిన్స్.

Category : movies

ఏ చిత్ర పరిశ్రమ ఐన సక్సెస్ చుట్టూనే తిరుగుతుంది.ఒక్క హిట్ పడితే చాలు అది వారి తల రాతను మార్చేస్తుంది.ఈ విషయంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక్క సక్సెస్ చాలు ఇండస్ట్రీలో పాగా వేయడానికి....ఇలా పరిశ్రమలో ఒక్క హిట్ తో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఆ అందాల భామలు ఎవరెవరో ఓ సారి చూద్దామా...!ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది అనుష్క‌. వ‌య‌సు 35 దాటినా కూడా ఇప్ప‌టికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో ప‌నిలేదు. ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 4 నుంచి 5 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని సమాచారం. ఈమె తాజగా కోన వెంక‌ట్ సినిమాలో కూడా నటిస్తోంది.దీంతో ఈమెకు భారీ పారితోషికాన్ని ఇచ్చి మరీ జేజమ్మను ఇందుకు ఒప్పించడం విశేషం.

ఇక సౌత్ లో లేడి అమితాబ్ గా పేరుతెచ్చుకున్న మరో భామ నయనతార.ఆమె అందం అభినయం అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె వయసు 33 దాటుతున్న ఇంకా చిన్న పెద్ద అనే తేడాలేకుండా తనకన్నా చిన్న వారితో కూడా నటిస్తూ అందినకాడికి పుచ్చు కుంటుందీ.ఈమెకు తెలుగు తమిళ్ మార్కెట్స్ లో మంచి వసూళ్లు వస్తు ఉండడం తో ....ఈమె ఒక్కో సినిమాకు రెండున్న‌ర నుంచి 4 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటుంది. సైరా కోసం 3 కోట్ల వ‌ర‌కు న‌య‌న‌తారకు ఇచ్చార‌ని సమాచారం.ఇక స‌మంత అక్కినేని కూడా ఈ జాబితాలో దుమ్ము దులిపేస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా స‌మంత‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈమె ఒక్కో సినిమాకు 2.5 నుంచి 3 కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తుంది.

సినిమాను బ‌ట్టి ఈమె రేట్ కూడా భారీ గానే పెంచుతుంది . ఇక తాజగా నాగ‌చైత‌న్య‌తో నటించిన మ‌జిలీ సినిమాకు గాను అలాగే ఓ బేబీ సినిమాకు గానూ ఈ అమ్మడు భారీ రెమ్యున‌రేష‌న్ అందుకున్నట్టు సమాచారం. ఇక ఈమె త‌ర్వాత ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మ‌రో హాట్ బ్యూటీ పూజా హెగ్డే. డిజే సినిమా త‌ర్వాత ఈమె జాతకం పూర్తిగా మారిపోయింది.ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేక‌పోయినా పూజాతో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ తో ఓ సినిమాలో న‌టిస్తున్న పూజా.. ఈ సినిమాకు గాను దాదాపు 2 కోట్ల నుంచి నుంచి 2.5 కోట్ల వ‌ర‌కు అందుకుంటుంది.ఇక మరో సీనియర్ హీరోయిన్ కాజల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ ఆమెకు స్టార్ ఇమేజ్ అలాగే ఉంది .

ఈ అమ్మడు ఒక్కో సినిమాకు కోటిన్న‌ర వ‌రకు చార్జ్ చేస్తుంది.ఇక మరో సీనియర్ భామ త‌మ‌న్నా ఈ అమ్మడు ఎఫ్-2 విజ‌యం త‌ర్వాత సినిమాకు కోటిన్నర నుంచి రెండు కోట్లు డిమాండ్ చేస్తుంది.ఇక ఈ అమ్మడు తరువాత వరుసలో ఉన్న హీరోయిన్స్ కైరా అద్వానీ, రాశీ ఖ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్,సాయి పల్లవి వంటి వారు కూడా ఈ మధ్య మంచి స్పీడ్ పెంచారు. వీళ్ళంతా ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటున్నారు. ఇక సాయి పల్ల‌వి సైతం మొన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమా కోసం కోటి 20 ల‌క్ష‌లు పారితోషికం అందుకుంది. మొత్తానికి తెలుగులో ఇప్పుడు మ‌న హీరోయిన్లు కొంద‌రు హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకోవడం విశేషం.