ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి తెలుగు సినిమాల్లో నటించింది అమలాపాల్. తమిళనాట బాగా ఇంకా పాపులర్. ఈ భామ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై రెస్పాండ్ అయింది. అమలాపాల్ మళ్లీ వార్తల్లో నిలిచింది.
అమలాపాల్ ఆల్రెడీ మీటూ వివాదంతో హెడ్‌లైన్స్‌లో ఎక్కింది. ఇటీవల ఓ దర్శకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అయితే, ఇప్పుడు ఆమె మరో విషయంలో వార్తల్లొకొచ్చింది. అమలాపాల్ గతంలో తమిళ దర్శకుడు విజయ్ను పెళ్లాడింది. ఏడాది తరువాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆమె డివోర్స్ తీసుకున్న తరువాత సినిమాల్లో బిజీగా మారింది. Amalapaul Gives Clarity On Second Marriage
తాజాగా, తమిళంలో రెండు మంచి విజయాలు సాధించింది. అంతేకాదు, ఆమె మళ్లీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోందని ప్రచారం జరుగుతుంది. అమలాపాల్ ఈ విషయమై స్పందించింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి ఉన్న మాట నిజమే కానీ, ఇప్పుడు ఈ విషయంలో నిర్ణయం తీసుకోను అంటోంది. మరో ఏడాది తరువాత ఆలోచిస్తాను అంటోంది. ఈ సారి పెళ్లి విషయంలో తొందరపడను అని చెబుతోంది.Amalapaul Gives Clarity On Second Marriage