//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేటి నుంచి మహిళల సౌత్‌జోన్‌ అండర్‌-19 క్రికెట్‌ పోటీలు

Category : sports

జేకేసీ మైదానంలో కర్ణాటక- గోవా ద ఆర్వీఆర్‌జేసీ మైదానంలో ఆంధ్రా-తమిళనాడు జె.నరేంద్రనాథ్‌ క్రీడా మైదానంలో హైదరాబాద్‌- కేరళ ఎస్వీఎన్‌కాలనీ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే మహిళల అండర్‌-19 సౌత్‌జోన్‌ క్రికెట్‌ పోటీలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఏసీఏ మహిళా విభాగం ఛైర్మన్‌ జాగర్లమూడి మురళీమోహన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రాతోపాటు కర్ణాటక, హైదరాబాద్‌, తమిళనాడు, గోవా, కేరళ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు గుంటూరులోని జేకేసీ, ఆర్వీఆర్‌జేసీ(చౌడవరం), జె.నరేంద్రనాథ్‌ గ్రౌండ్స్‌(పేరేచర్ల) క్రీడా మైదానాల్లో టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంబమవుతాయని చెప్పారు.