//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు టీ20 చివరి మ్యాచ్

Category : sports

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ 20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్‌లో ప్రపంచ ఛాంపియన్‌ను 4-1తో మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌పై కన్నేసింది. గువాహటి ఓటమితో షాక్ తిన్న కోహ్లీసేన.. ఉప్పల్‌ స్టేడియంలో ఆసీస్‌ దెబ్బ కొట్టాలని చూస్తుంది. కాకపోతే హైదరాబాద్ లో గత పది రోజులు వర్షం వణికిస్తోంది. సాయంత్రం అయితే చాలు దట్టమైన మబ్బులతో ఓ రేంజి లో వర్షం పడుతుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పల్ స్టేడియం లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యం లో ఈరోజు జరిగే మ్యాచ్ కి వరణుడు కరుణిస్తాడా లేదా అనేదాని ఫై అంత ఖంగారు పడుతున్నారు.

మరోపక్క ఈ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మొదలవనున్న మ్యాచ్‌ కోసం సుమారు 1,800 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి మ్యాచ్‌కు అనుమతించని నిషేధిత వస్తువుల జాబితాలో కొత్తగా గొడుగును చేర్చారు. వర్షం వచ్చే అవకాశముంది కదా అని వీక్షకులు గొడుగులు తీసుకొస్తే లోపలికి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేసారు. మ్యాచ్‌ భద్రత కోసం స్టేడియం చుట్టూ, లోపలి పరిసరాల్లో 56 సీసీ కెమెరాల్ని అమర్చారు. వీటిన్నింటినీ పర్యవేక్షించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.