//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడే జనసేన ఆవిర్భావ సభ...!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం కొన్ని రోజులుగా ఊహకందని రీతులతో ముందుకు సాగుతుంది. ఒక పక్క ఏపీ సీఎం బడ్జెట్ సమావేశాలతో బిజీ గా ఉంటే, ప్రతిపక్షనేత జగన్ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజాసంకల్ప యాత్రను చేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తనదయిన రీతిలో ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయాలకు కీలకమైన సమయం అని చెప్పచ్చు, ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభను పవన్ కళ్యాణ్ గుంటూరు వేదిక గా నిర్వహించడానికి నిర్ణఇంచారు. ఈ వేదికపై నుంచి పవన్‌కల్యాణ్‌ తమ రాజకీయ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని చెప్పారు. ఈ సభ రాజకీయంగా జనసేన పార్టీ కి చాలా కీలకమైంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలు, ఇచ్చిన హామీలు సరిగా నెరవేరకపోవడం, ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో పవన్‌ వేయబోయే అడుగులు ఎలా ఉంటాయనేది రాజకీయనాయకులు ఎంతో అతృతతో వేచి చూస్తున్నారు. \

ఇప్పటికి జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి నాలుగు సవంత్సరాలు అయ్యింది. అప్పటినుండి రాష్ట్ర స్థాయిలో ఈ మాదిరి సభను ఇంతకుముందు ఎప్పుడు జనసేన నిర్వహించలేదు. సభ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. 100 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవు, 10 అడుగుల ఎత్తులో వేదికను చాలా విశాల వంతంగా నిర్మించారు.

సభలో ఏ మూలన ఉన్నా పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాన్ని వీక్షించేలా 50కు పైగా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సభ లో పాల్గొనడానికి గుంటూరు కి వేలాదిగా అభిమానులు, పార్టీ నేతలు చేరుకున్నారు. జనసేన పార్టీ నేతలు, అభిమానులతో గుంటూరు ఇప్పటికే కిక్కిరిసిపోయింది.