Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడే తోలి వన్డే...!

Category : sports

సౌతాఫ్రికాలో భారత జట్టు మరోసవాలుకి సిద్ధమైంది. టెస్టు సిరీస్ ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు చివరి టెస్టులో సఫారీలపై విజయం సాధించడం టీమిండియా ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆరు వన్డేల సిరీస్‌ డర్బన్ వేదికగా జరగనుంది.ఇక టీమిండియా వన్డే జట్టు పూర్తి సన్నద్ధతతో బరిలో దిగుతోంది. టెస్టుల్లో విఫలమైన రోహిత్ శర్మ వన్డేల్లో రాణించి ఆకట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు.

ధావన్ కూడా తానేంటో విదేశాల్లో రుజువు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. పేసర్లను ధాటిగా ఎదుర్కోవడం వీరి బలం కావడంతో టీమిండియాకు మంచి శుభారంభం లభిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇక రహానేను మూడో ఓపెనర్ గా పేర్కొంటున్నప్పటికీ మూడో నంబర్ లో కోహ్లీ ఫాంలో ఉన్నాడు. ఆ తరువాత కఠినమైన సఫారీ పిచ్ కు ఎదురొడ్డేందుకు రహానేను రంగంలోకి దించే అవకాశం కనబడుతోంది.

Related News