//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సినీ స్టార్స్ స్పందించాలి లేకుంటే సినిమాలు బంద్..!

Category : state

నాడు రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడం పట్ల కేంద్రం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రత్యేక హోదా పై నేతలు, కార్యకర్తలు తీవ్ర కృషి చేస్తున్నారు.

ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ప్రయత్నానికి సినీ హీరోలు కూడా స్పందించాలని, ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్న చీమకుట్టినట్టు కూడా లేదని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల్లో సినీ హీరోలు నోరు తెరవాలని, లేకపోతే వారి సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ముందు వారు నిరసన చేపట్టారు. ప్రముఖ హీరోలు చిరంజీవి, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు, మహేష్ బాబు తదితరుల ఫొటోలను మెడలో వేసుకుని వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం పై సినీతారలు స్పందించాల్సి ఉంది.

Related News