//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కూటమితో కటీఫ్ ..టీజేఎస్ షాకింగ్ నిర్ణయం

Category : politics

నిన్నటి దాకా మహాకూటమి పొత్తులతో టీఆర్ఎస్ కుబుద్ధి చెప్పాలనుకున్న పార్టీలు కటీఫ్ అనాలనే నిర్ణయానికి వచ్చాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరూ సర్దుకుపోకపోవటంతో కూటమి విచ్చిన్నం జరిగేలా కనిపిస్తుంది. కూటమి నేతలతో మాట్లాడినప్పుడు కాస్తో కూస్తో ఆలోచిస్తున్న కోదండ రామ్ తమ పార్టీ శ్రేణుల దాగారకు వచ్చే సరికి మళ్ళీ మొదటికే వస్తున్నారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకుంటే కొనసాగేది లేదని తేల్చేశారు. అది సాధ్యం కాని వ్యవహారం కావటంతో కాంగ్రెస్ కూడా చేతులెత్తేసింది. సర్దుకుపోదాం అని చంద్రబాబు ఎంత చెప్తున్నా అందరికీ సర్దుకుపోయే ధోరణి లేకపోవటమే కూటమి విచ్చిన్నానికి కారణం. TJS Shocking Decision out from Mahakutami

టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ఏర్పాటైన మహాకూటమి లో టీజేఎస్ తో మొదటి నుండి పెద్ద తలనొప్పి ఫేస్ చేస్తున్నారు కూటమి పార్టీల శ్రేణులు. తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ,సీపీఐ,టీజేఎస్‌ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాలేదు. సీట్ల కోసం మహాకూటమి శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సీట్ల సర్దుబాటుపై తేల్చమని అల్టిమేటం జారీ చేసిన టీజేఎస్‌ మా లెక్క తేల్చకుండా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామనటంపై అసహనం వ్యక్తం చేస్తుంది. పొత్తులో భాగంగా తమ పార్టీకి 15 సీట్లు కావాలని టీజేఎస్‌ డిమాండ్ చేస్తుంది. కానీ కాంగ్రెస్ 8-9 సీట్లను కేటాయించాలని భావిస్తుంది. మహా అయితే 10 ఇచ్చే అవకాశం ఉంది. అహి కూడా ఒకటి రెండు స్థానాలు టీడీపీ సర్దుకుపోతే... అయినా సరే 15 సీట్లకన్నా తక్కువగా కేటాయిస్తే ఒంటరిగా గానీ కలిసి వచ్చే పార్టీలతో గానీ ఎన్నికల బరిలో దిగేందుకు తాజాగా జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు టీజేఎస్ నేతలు. TJS Shocking Decision out from Mahakutami

టీజేఎస్‌ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు 36 మంది ఆశావహులున్నారు. కూటమి వల్ల వారికి అవకాశం లేకుండా పోతుంది. వారందరికీ సీట్లు వచ్చే పరిస్థితి లేకపోవటంతో అభ్యర్థులు కోర్ కమిటీ సమావేశంలో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీజేఎస్ కోరుకోని స్థానాలైన మలక్‌పేట, చాంద్రాయణగుట్ట వంటి స్థానాలను కాంగ్రెస్ పార్టీ కేటాయించడం,మిర్యాలగూడ స్థానాన్ని ఇవ్వాలని కోదండరాం అడిగినప్పటికీ ఆ స్థానాన్నిఇవ్వకపోవటం కూడా టీజేఎస్ అసహనానికి కారణం. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదితర ఉమ్మడి జిల్లాల నుంచి టీజేఎస్ కు ఒక్క సీటును కూడా కేటాయించకపోవటంపైనా చర్చిన టీజేఎస్ నాయకులు 15 స్థానాలు ఇవ్వకుంటే దోస్తీ కటీఫ్ అని తేల్చేశారు.TJS Shocking Decision out from Mahakutami