//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ స్థానాలు పై కన్నేసిన కోందండరాం ..అయోమయంలో కాంగ్రెస్

Category : politics

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ అతని బృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక మిగిలిన పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ మహాకూటమి లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, టీజేఎస్, టీడీపీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. కెసిఆర్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా మహా కూటమిలో మాత్రం తమ అభ్యర్థుల సీట్లపై ఇంకా స్పష్టత రాలేదు. వీటిలో కాంగ్రెస్ పార్టీ మాత్రం 34 అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన అభ్యర్థుల సీట్లు ఇంకా ఖరారు కాలేదు.

అయితే మహాకూటమిలో భాగంగా కోదండరాం నేతృత్వం లోని టీజేఎస్ 16 నియోజకవర్గాలను అడుగుతున్నది. అయితే 12 సీట్లకు తగ్గొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం 8 సీట్లు ఇచ్చేందుకే ఒప్పుకొన్నారని తాజా సమాచారం.

టీజేఎస్ కు ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయమై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోయినా, టీజేఎస్ మాత్రం ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయమై ఓ నిర్ణయానికి వచ్చింది. మహా కూటమి ముందు సుమారు 12 సీట్లకు పైగా ఆ పార్టీ ప్రతిపాదించింది. వీటిలో మహాబూబ్‌నగర్, ముథోల్, జడ్చర్ల, మిర్యాలగూడ, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, పెద్దపల్లి, ఆశ్వరావుపేట, నాంపల్లి, రామగుండం, అంబర్ పేట, ఖైరతాబాద్, మహాబూబాబాద్, మలక్ పేట, జూబ్లీహిల్స్ స్థానాలను టీజేఎస్ కోరుతోంది. చివరిగా మహాకూటమిలో సీట్ల సర్దుబాట్ల విషయంపై స్పష్టత రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో వేచి చూడాలి.