//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీజేఎస్ అభ్య‌ర్థులు పోటీ చేసే స్థానాలు ఖ‌రారు..!

Category : politics

టీజేఎస్ అధినేత కోదండ‌రామ్ మ‌రికొద్ది సేప‌ట్లో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డితో భేటీ కానున్నారు. అయితే, మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా టీజేఎస్ పార్టీకి ఎనిమిది ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గాల‌ను కేటాయించేందుకు కాంగ్రెస్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఏఏ స్థానాల్లో ఆ ఎనిమిది సీట్ల‌ను స‌ర్దుబాటు చేయనున్నార‌న్న దానిపై పార్టీ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా, పొత్తులో భాగంగా తాము కోరిన స్థానాల‌నే ఇవ్వాల‌ని టీజేఎస్ ప‌ట్టుబ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. TJS candidates Competition positions finalized

మెద‌క్‌, దుబ్బాక‌, వ‌ర్ధ‌న్న‌పేట‌, మ‌ల్కాజిగిరి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, సిద్దిపేట అసెంబ్లీ సీట్ల‌ను టీజేఎస్‌కు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీక‌రించింది. అయితే, టీజేఎస్ కోరిన‌ట్టు వ‌రంగ‌ల్ ఈస్ట్‌ను కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం తెల‌ప‌డం లేదు. ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించామ‌ని కాంగ్రెస్ చెబుతోంది. న‌గ‌రంలోని ఎండు చోట్ల త‌మ అభ్య‌ర్థి పోటీలో లేక‌పోతే ఎలా అని కాంగ్రెస్ను ప్ర‌శ్నిస్తోంది. TJS candidates Competition positions finalized

దీంతో ఆ స్థానంలో మేడ్చ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌మ‌కు కేటాయించాల‌ని తెలంగాణ జ‌న‌స‌మితి కోరుతోంది. కోదండ‌రామ్ పోటీ చేస్తే జ‌న‌గామను కూడా జ‌న‌స‌మితికి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. అప్పుడు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మ‌య్యకు వేరే చోట స‌ర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప‌రిస్థితుల్లో కాసేప‌ట్లో భేటీ కానున్న ఉత్త‌మ్‌, కోదండ‌రామ్ ఎవ‌రెవ‌రు ఏఏ స్థానాల్లో పోటీ చేయాల‌న్న‌దానిపై ఓ నిర్ణ‌యానికి రానున్నారు.TJS candidates Competition positions finalized

Related News