//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Category : editorial state

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది అధికమాసం ఉన్న కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల సమయంలో టిటిడి స్వల్పమార్పులు చేపట్టింది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు వాహనసేవ జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులేదు. రాత్రివేళ ఒక గంట ముందుగా అనగా 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ జరుగుతుంది. గరుడవాహనసేవ అరగంట ముందుగా రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 12న అంకురార్పణం నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

(9గం|| నుండి 11 గం|| వరకు) (8 గం|| నుండి 10 గం||ల వరకు)

13-09-2018 సా|| ధ్వజారోహణం (4 నుంచి 4.45 గం||ల వరకు), పెద్దశేషవాహనం

14-09-2018 చిన్నశేష వాహనం హంస వాహనం

15-09-2018 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

16-09-2018 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

17-09-2018 మోహినీ అవతారం గరుడ వాహనం
(రా.7 నుండి 12 వరకు)

18-09-2018 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు),
గజవాహనం

19-09-2018 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

20-09-2018 రథోత్సవం(ఉ.7.30 గంటలకు) అశ్వ వాహనం

21-09-2018 చక్రస్నానం ధ్వజావరోహణం

(ఉ.7.30 నుండి 10 వరకు) (రా|| 7 నుంచి 9 వరకు)

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Related News