//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టైమ్స్ స‌ర్వే అవుట్.. పుంజుకుంటున్న ప‌వ‌న్.. దూసుకెళుతున్న‌ జ‌గ‌న్.. మ‌రి చంద్ర‌బాబు ప‌రిస్థితి ఏంటి..?

Category : politics

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నాలుగేళ్ళ పాల‌న పై ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక స‌ర్వే జ‌రిపిందా.. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం చంద్ర‌బాబుకు పెద్ద షాకే త‌గిలింది. దిన‌ప‌త్రికి వివిధ అంశాల‌పై రాష్ట్రంలో స‌ర్వే నిర్వ‌హించింద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటు ఎవ‌రికి వేస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు 42 శాతం మంది జ‌గ‌న్‌కే ఓటేస్తామ‌న్నార‌ట‌. త‌మ ఓటు చంద్ర‌బాబుకే అన్న‌వాళ్ళు 30 శాత‌మేన‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ కు 19 శాతం మంది మ‌ద్ద‌తిచ్చారు.

అంతే కాకుండా చంద్ర‌బాబు పాల‌న పై జ‌నాల అభిప్రాయం కోర‌గా ఏమీ బాగోలేద‌ని 42 శాతంమంది అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. చంద్ర‌బాబు పాల‌న బాగుంద‌ని 36 శాతం మంది తేల్చేశార‌ట‌. మిగిలిన వారు పెద్ద‌గా సంతృప్తిగా లేదనే చెప్పార‌ట‌. ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబు అనుభ‌వం రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని 58 శాతం అభిప్రాయ ప‌డ్డార‌ట‌. అంటే దేశంలో తానే అందరిక‌న్నా సీనియ‌ర్‌ను తానే అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుది కేవ‌లం సొంత‌డ‌బ్బా అని తేలిపోయింది.

ఇక‌ అంత్యంత కీల‌క‌మైన ప్ర‌త్యేక‌హోదా సాధ‌న‌లో చంద్ర‌బాబు ఫెయిల‌య్యార‌ని 56 శాతం మంది అనుకుంటున్నార‌ట‌. నాలుగేళ్ళ‌లో అవినీతి పెరిగిపోయిద‌ని అనుకుంటున్న వారు 46 శాతం మంది ఉన్నార‌ట‌. ఇలా చంద్ర‌బాబు పాల‌న‌కు సంబంధించిన‌ ప్ర‌తీ అంశంలోనూ జ‌నాల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న విష‌యం స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డింది. దీంతో రేపు ఐదు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో కానీ లేక‌పోతే వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో గానీ జ‌నాల తీర్పు ఎలా ఉండ‌బోతోందో కొంత వ‌ర‌కూ అంచ‌నాకి వ‌చ్చే అవ‌కావం ఉంది. మ‌రి వ‌రుస‌గా తెర పైకి వ‌స్తున్న స‌ర్వేలన్నీ.. టీడీపీకి వ్య‌తిరేకంగా వ‌స్తున్న నేప‌ధ్యంలో.. ఇప్ప‌టికే చంద్ర‌బాబు అండ్ కో మేలుకుంటారో.. లేక చేతులు ఎత్తేస్తారో అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.