Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితా.. అనసూయ 13వ స్థానానికి పడిపోయిందా

Category : state

ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్, ఉమెన్ అంటూ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక టైమ్స్ అవార్డులు ప్రకటిస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా హైద‌రాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ స్మాల్ స్క్రీన్ (టెలివిజన్) 2018 సంబంధించిన అవార్డులును ప్రకటించింది.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటివి ఎవ‌రూ విడుద‌ల చేయ‌లేదు.. మొద‌టి సారి టైమ్స్ ప‌త్రిక హైద‌రాబాద్ లిస్ట్‌ను విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలో మొత్తం 15 స్థానాల‌కు సంబంధించిన లిస్ట్‌ను విడుద‌ల చేసింది టైమ్స్.

ఈ లిస్ట్‌లో ప‌లువురు తెలుగు బుల్లితెర భామ‌లు చోటు ద‌క్కించుకున్నారు. వారిలో నిన్నేపెళ్ళాడుతా ఫేమ్ మృదుల ఫ‌స్ట్ ప్లేస్ ద‌క్కించుకోవ‌డం విశేషం.అలాగే యాంక‌ర్ ప్ర‌దీప్ ప్లాప్ ప్రోగ్రామ్ పెళ్లిచూపులు విన్న‌ర్ జ్ఞానేశ్వ‌రి రెండో స్థానం ద‌క్కించుకోగా వ‌ర్షిణి మూడో స్థానంలో నిలించింది.

ఇక యూంక‌ర్ ర‌ష్మీ 4వ‌ స్థానంలో నిల‌వ‌గా.. విష్ణుప్రియ 5వ స్థానంలో, యూంక‌ర్ శ్రీముఖి 12వ స్థానంలో, మ‌రో యాంక‌ర్ అన‌సూయ 13 స్థానంలో నిలిచారు. టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ లిస్ట్‌లో 5 గురు తెలుగు బుల్లితెర యాంక‌ర్లు చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం.

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్…

మొదటి స్థానం – నిన్నేపెళ్లాడతా ఫేమ్ – భూమిషెట్టి,

రెండవ స్థానం – ప్రదీప్ పెళ్లిచూపులు ఫేమ్ – జ్ఞానేశ్వరి

మూడ‌వ స్థానం – ఢీ జోడీ టీమ్‌లీడ‌ర్ – వర్షిణి సౌందర్ రాజన్

నాల్గో స్థానం – యాంకర్ రష్మీ గౌత‌మ్

ఐద‌వ స్థానం – యాంక‌ర్ విష్ణు ప్రియ

ఆరు నుండి పదోవ స్థానం వరకు- ఇత‌రులు

పదకొండో స్థానం – బిగ్‌బాస్ ఫేం – దీప్తి సునయన

పన్నెండో స్థానం – యాంకర్ శ్రీముఖి

పదమూడో స్థానంలో – యాంకర్ అనసూయ

Related News