Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీట్లలో టైట్‌ ఫైట్‌.. పశ్చిమగోదావరిలో ఎవ‌రికి ఎన్ని సీట్లు... ?

Category : state politics

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం అనేక మలుపులు, వివాదాలు, ఘర్షణల నడుమ కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం అన్నట్టుగా ముగిసింది. గత ఎన్నికలకు భిన్నం గా ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. మొత్తంగా 80% మేర పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో మహిళా ఓటింగ్‌ పెరగడం, పురుష ఓట్లు తగ్గడం గమ నార్హం. అయితే, ఈ పరిణామాన్ని రెండు ప్రధాన పార్టీలు కూడా తమకు సానుకూలంగానే తీసుకోవడం గమనార్హం. మహిళా ఓటు బ్యాంకు తమకు అనుకూలమని, పసుపు-కుంకుమ పథకం తమను గట్టెక్కిస్తుందని టీడీపీ చెబుతోంది. అయితే, వైసీపీ మాత్రం ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటేనని, దీనివల్ల తాము లాభిస్తామని అంచ నాలు వేస్తోంది. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేసుకుంటోంది. అయితే, ఎవరు ఎలాంటి అంచనాలు వేసుకుని ముందుకు సాగినా కూడా తుది ఫలితం కోసం మే 23 వరకు వెయిట్‌ చేయకతప్పదు.

ఏపీని పాలించేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న జగన్‌.. గత ఎన్నికల్లో కోల్పోయిన ఓట్లను రాబట్టి ఈ దఫా.. గెలుపుగుర్రం ఎక్కాలని శతవిధాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్‌ పాదయాత్ర ఇక్కడ కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. అదేసమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా తమకు కలిసి వస్తుందని ఇక్కడ వైసీపీ అంచనా వేస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీ అంచనాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల్లో.. ఈ దఫా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తుందని అంటున్నారు. వాస్తవానికి పశ్చిమగోదావరి అంటేనే టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి గతంలో పితాని సత్యనారాయణ వంటి హేమా హేమీలు టీడీపీ తరఫున విజయం సాధించారు. అయితే, ఈసారి మాత్రం ప్రజలు తమవెంటే ఉన్నారని వైసీపీ అంచనాలు కడుతోంది.

గత ఎన్నికల్లో పశ్చిమలో టీడీపీ విజయదుందుభి మోగించింది. అప్పటి ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల నుంచి టీడీపీ గెలుపు గుర్రం ఎక్కగా, వైసీపీ 0 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక, బీజేపీ ఒక స్థానంలో గెలించింది. వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వర్సెస్‌ టీడీపీ నువ్వా-నేనా? అనే రేంజ్‌లో ఫైట్‌ సాగుతుందని చెబుతున్నారు. మారిన అంచనాల నేపథ్యం, పెరిగిన మహిళా ఓటు బ్యాంకు వంటి రీజన్ల నేపథ్యంలో వైసీపీ విజయం ఖాయమని ఈ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ.... ఇక, నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరంలో టీడీపీ విజయం ఖాయమని నేతలు అంచనాకు వచ్చారు. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు, బలమైన అభ్యర్థుల నేపథ్యంలో ఈ అంచనా ఏమేరకు సక్సెస్‌ అవుతుందనేది వేచి చూడాలి.

Related News