//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హోరాహోరీ పోరు..ఆ ఒక్క జిల్లాలోనే 950 కోట్లు ఖ‌ర్చు చేసిన అభ్య‌ర్థులు...? ఓటుకు ఎన్ని నోట్లో తెలిస్తే షాక్ ...?

Category : state politics

దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఏపీ లోని ఒక జిల్లాకు సంబంధించిన నియోజ‌క వ‌ర్గ అభ్య‌ర్థులు దాదాపు 25 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు సమాచారం. మొత్తం జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన వ్యయం రూ.950 కోట్లు పైమాటేనని ఇంట‌లీజేన్స్ వ‌ర్గాల నుండి స‌మాచారం .ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎన్ని ఏర్పాట్లు చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎన్నికల కోడ్‌కు ముందే జిల్లాలో 47కు పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే పట్టుబడ్డ మొ త్తం 5.92 కోట్లే అని లెక్క తేలింది ...

అయితే ఇది కూడా సామాన్య ప్రజల పొలాలు అమ్ము కున్న రైతులు, బిల్లులు చూపని వ్యాపారుల డబ్బులను మాత్రమే స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తుంది .జిల్లాలో 31,72,413 మంది ఓటర్లు ఉండ‌గా , సగటున ఒక్కో నియోజకవర్గంలో 2.25 లక్షల ఓటర్లు ఉన్నారు. అయితే ఈ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి నేత‌లు ఓటుకు 500 నుంచి 2,500 పైగా పంపిణీ చేసిన‌ట్లు తెలుస్తుంది .అంతే కాదు పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అయితే 3 వేల వ‌ర‌కు కూడా పంచిన‌ట్లు ఆయా వ‌ర్గాల నుండి స‌మాచారం అందుతుంది .

మొత్తం ఓట‌ర్ల‌లో 80 శాతం మందికి ఓటుకు నోటు పంపిణీ చేయ‌డంతో, ఒక్కో నియోజకవర్గంలో 20 కోట్ల వరకు ఖ‌ర్చు పెట్టి ఓట్ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తుంది. ఇక భోజనాలు, మైకు అద్దెలు, వాహనాల అద్దెలు, డీజిల్‌, మద్యం కొనుగోళ్లకు 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా ఖ‌ర్చు చేసిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా ....అయితే ఈలెక్కా లోక్‌సభ అభ్యర్థులు ద‌గ్గ‌రికి వ‌చ్చెస‌రికి ఒక్కొ క్కో అభ్య‌ర్థి 50 కోట్లకు పైగా సమర్పించినట్లు తెలుస్తోంది.జిల్లాలోని రెండు పార్ల మెంట్‌తో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 950 కోట్లకు పైగా అనధికారికంగా ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది.

నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలో పోటీ తీవ్రంగా ఉండడంతో ఒక పార్టీ ఓటుకు 3 వేలు ఇచ్చి ఓట్ల‌ను కొనుగోలు చేస్తే , కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో ఓ పార్టీ అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేయాలని ఇచ్చిన డబ్బులో 50శాతం మాత్ర‌మే ఓట‌ర్ల‌కు పంచిన‌ట్లు తెలుస్తుంది.అయితే ఇప్ప‌డు అదే ఆ అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇంట‌లీజెన్స్ రిపోర్ట్ . అంతేకాదు.. ఓ పార్టీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం హైదరాబాదులో ఉన్న స్థలాన్ని తాక‌ట్టు పెట్టినట్లు తెలుస్తోంది.

Related News