//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరో మృగాడి చేతిలో మూడేళ్ళ చిన్నారి బలి !

Category : national

కాలక్రమేణా మగాడుడు మృగాడు గా మారిపోతున్నాడు తమ కామ వాంఛ తీర్చుకోవడానికి వావి వరస.. వయసుతో పనిలేదని అభం శుభం తెలియని పసి కందుల నుంచి నూరేళ్ళ వృద్ధుల వరకూ తన కామదాహం తీర్చేవారిగా భావిస్తున్నాడు.

తాజాగా యూపీలో సొంత బాబాయే చిన్నారి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవ మృగం చేతికి చిక్కిన చిన్నారి ప్రస్తుతం ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆస్పత్రిలో పోరాడుతున్నది. ఈ దారుణ ఘటన థాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. లక్నో నగర్ నిగమ్ ప్రాంతానికి చెందిన బాధిత చిన్నారి తండ్రి కూలీ పనులు చేసుకుంటూ భార్య ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. అతని 20 ఏళ్ల తమ్ముడు హోలీ పండగ రోజున ఇంటికి వచ్చాడు.

శుక్రవారం ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ళ అన్న కూతురు పై కన్నేసి.. ఆ యువకుడు తన వెంట తీసుకొని వెళ్ళాడు.. అలా ఓ పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకొని వెళ్ళి.. మృగంలా మారి చిన్నారిపై లైంగిక దాడి చేశాడు.. పాప బాధతో ఏడుస్తుంటే పారిపోవడానికి ప్రయత్నిస్తున్నఆ యువకుడిని గమనించిన చుట్టుపక్కల వారు అతనిని పట్టుకొని దేహ శుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.

అనంతరం మూడేళ్ళ చిన్నారిని చికిత్స నిమిత్తం కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీకి తరలించారు. చిన్నారి కి తీవ్ర రక్త స్రావం కావడంతో సర్జరీ చేశామని.. పరిస్తితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. నిందితుడిని పోక్సో చట్టం ప్రకారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. చిన్నారి పరిస్తితి తల్లిదండ్రులకే కాదు.. అక్కడ ఉన్న వారికి కూడా కంట తడి పెట్టిస్తున్నది.

Related News