//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి..

Category : world

అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుందిఓ అగ్ని ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు సజీవదహనమయ్యారు. వారు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు అవడం చాలా బాధాకరం శ్రీనివాస్ నాయక్ - సుజాత నాయక్ దంపతులకు ముగ్గురు సంతానం కనీసం వారి వయస్సు 18 సంవత్సరాలు కూడా లేవు స్వస్థలం నల్గొండ జిల్లా నేరడు గొమ్ము మండలం గుర్రపుతండా గ్రామం కావడం గమనార్హం.శ్రీనివాస్ కు ఇద్దరు కుమార్తెలు సాత్విక నాయక్ (16) - జ్వాయి నాయక్ (13). ఓ కుమారుడు సుహాస్ నాయక్ (14).

శ్రీనివాస్ నాయక్ గతంలో అమెరికాలో పాస్టర్ గా పనిచేశారు. కానీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు పిల్లలు మాత్రం అమెరికాలోనే ఉండి మిసిసిపీలోని ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. శ్రీనివాస్ కు టుంబానికి అక్కడి కొలిర్ విలీలోని బైబిల్ చర్చిలో భాగస్వామ్యం ఉంది.


క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శ్రీనివాస్ పిల్లలను స్థానిక చర్చిని నడిపే క్రౌడ్రెట్ కుటుంబం తమ ఇంటికి ఆహ్వానించింది. సాత్విక - జ్వాయి - సుహాస్ వారి ఇంటిని అలంకరిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఇల్లంతా మంటలు చెలరేగాయి. ఆ ఇంటి యజమానురాలు కారీ క్రౌడెట్ కూడా మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాత్విక - జ్వాయి - సుహాస్ ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు. పిల్లల మరణవార్త తెలుసుకొని శ్రీనివాస్ నాయక్ కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారు హుటాహుటిన హైదరాబాద్ నుంచి అమెరికా పయనమయ్యారు. మృతదేహాలను స్వదేశం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News