Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు ?

Category : politics

ఆంధ్ర రాజకీయాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి సరికొత్త రాజకీయ విలువలు నెలకొల్పుతున్నాడా అంటే అవునననే సమాధానం వస్తుంది. అయితే గతంలో ఉన్న విలువలను మధ్యలో వచ్చిన పాలకులు భ్రష్టు పట్టిస్తే వాటిని జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ నెలకొల్పోయే విధంగా ముందుకి పోతున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ ఫిరహింపుల మీద జగన్ తీసుకున్న స్టాండ్ అనేది మాత్రం గొప్ప విషయం. పక్క పార్టీలో గెలిచి తన పార్టీలోకి రావాలంటే ఆ పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పటమే కాకుండా దానిమీదే నిలబడుతున్నాడు జగన్.

ఇక టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం టీడీపీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసిమరీ వైసీపీ లోకి వస్తామని చెప్పినట్లు తెలుస్తుంది. దానిని జగన్ మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మీరు రాజీనామా చేసి వస్తే మేము మా పార్టీ తరుపున గెలిపించుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అలా రాజీనామా చేసి వెళ్ళేది ఎవరంటూ టీడీపీలోనే పెద్ద చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది. వస్తున్నా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణ జిల్లాకి చెందిన ఒక్క నేత, గుంటూరు జిల్లాకి చెందిన ఒక్క నేత, ప్రకాశం జిల్లాకి చెందిన మరో నేత ఈ ముగ్గురు రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. కృష్ణ జిల్లా నుండి వచ్చే ఎమ్మెల్యే, కొడాలినానికి మిత్రుడని తెలుస్తుంది. అలాగే ప్రకాశంలో జిల్లా నుండి వచ్చే ఎమ్మెల్యే గతంలో వైసీపీ తరుపున గెలిచి టీడీపీకి వెళ్లినవాడని తెలుస్తుంది.

Related News