//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాక్ బోర్డర్ లో ముగ్గురు జవాన్లు మృతి !

Category : national

పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పదాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్లోని కేరీ సెక్టార్లో కాల్పులకు తెగబడిన పాక్ రేంజర్లు ముగ్గురు భారత జవాన్లను పొట్టన బెట్టుకున్నారు.

120వ ఇన్‌ఫ్యాంట్రీ బ్రిగేడ్‌ బెటాలియన్‌కు చెందిన జవాన్లు నియంత్రణ రేఖ వెంబడి గస్తీలో కాస్తుండగా.. పాక్ సైన్యం కాల్పులు జరిపింది. రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ జరిపిన ఆకస్మిక కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ముగ్గురు భారత జవాన్లు వీర మరణం పొందారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం తిరిగి కాల్పులు ప్రారంభించింది.

పాక్ బలగాలు శుక్రవారం సాయంత్రం కూడా రాజౌరీ జిల్లాలోని లామ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డాయి. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. నౌషెరా సెక్టార్లో గురవారం సాయంత్రం కూడా పాక్ కాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య గంటకుపైగా కాల్పులు జరిగాయి.

Related News