//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మూడు సినిమాలను లైన్లో పెట్టేసాడు.

Category : movies

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు పెంచేసాడు. వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ కావడంతో మరో సినిమా చెయ్యడానికి సమయం తీసుకున్న బన్నీ తాజాగా మరో మూడు సినిమాలకు సైన్ చేసాడు. బ‌న్నీ తదుప‌రి సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కే కుమార్‌తో ఉంటుందట‌. బ‌న్నీ కోసమే ప్ర‌స్తుతం విక్ర‌మ్ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంద‌ట‌. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో బ‌న్నీ మ‌రోసారి సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చేస్తున్న `అర‌వింద స‌మేత‌` త‌ర్వాత త్రివిక్ర‌మ్.. బ‌న్నీ సినిమా కోసం క‌థ సిద్ధం చేస్తార‌ట‌. త్రివిక్ర‌మ్ త‌ర్వాత `సైరా` డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో బ‌న్నీ సినిమా చేస్తాడ‌ట‌. బ‌న్నీకి సురేంద‌ర్ రెడ్డి ఇప్ప‌టికే లైన్ చెప్పాడ‌ని స‌మాచారం.