అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ తీరును మరోసారి తప్పు పడుతూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనల్ని నిర్వహించారు. అమెరికా వ్యాప్తంగా 46 నగరాల్లో ఈ ఆందోళనలు చోటు చేసుకున్నాయి. అమెరికాలోని ప్రధాన నగరాలైన లాస్ ఏంజెలిస్ కాలిఫోర్నియా, న్యూయార్క్... ఫ్లోరిడా.. ఇలా పలు నగరాల్లో ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.
అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ను తొలగించాలని.. అభిశంసన చర్యలను కాంగ్రెస్ ప్రారంభించాలని వారు కోరుతున్నారు. దేశ వ్యాప్తంగా 46 నగరాలకు చెందిన వేలాది ప్రజలు వీధుల్లోకి రావటంతో ట్రంప్ పై వేటు వేయాలన్న వాదనకు మరింత బలం చేకూరింది. పవర్ లోకి వచ్చాక ట్రంప్ వలస విధానాలను వ్యాపార ఒప్పందాల్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలు వీధుల్లో తమ నిరసనను తెలియజేశారు. అయితే...కొన్నిచోట్ల మాత్రం ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలకు ధీటుగా ట్రంప్ అనుకూల ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.