//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొటిన బకాయిల రద్దు..!

Category : national

మొండి బకాయిల కింద వేల కోట్ల రూపాయల రుణాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.కొంతమంది పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు ఎస్బీఐ నుంచి వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు కానీ,తిరిగి చెల్లించలేదు.

ఈ రుణాలను మొండి బకాయిలుగా పరిగణించిన ఎస్బీఐ వాటిని రద్దు చేసింది.సుమారు 20,339 కోట్ల రుణాలను ఎగవేతదారులు చెల్లించలేదని బ్యాంకు రద్దు చేసింది.కాగా,ఎస్బీఐ తో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 81,683 కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రద్దు చేశాయి.

2016-17 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9,205 కోట్లు,బ్యాంక్ ఆఫ్ ఇండియా 7346 కోట్లు,కెనరా బ్యాంక్ 5,545 కోట్లు,బ్యాంక్ ఆఫ్ బరోడా 4348 కోట్ల బకాయిలను రద్దు చేశాయి.