సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాష్టీకాలు అంతా ఇంతా కావు. మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ, ఐసిస్ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. మహిళలను సెక్స్ బానిసలుగా, చిన్నారులను ఐఎస్ మూకలు ఆత్మాహుతి దాడులకు వాడుకోవడం చేస్తున్నాయి. ఇంకా ప్రపంచ దేశాలపై దాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకృత్యాలకు పాల్పడుతున్న ఐఎస్ దాడుల నుంచి దేశాలు మేల్కోవాలంటూ ఓ సిరియన్ బాలుడు చేసిన కామెంట్లు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి.
ఐసిస్ మూకలకు తగిన బుద్ధి చెప్పాలని, సిరియాలో ఎందరో తమ కుటుంబీకులను కోల్పోతున్నారని ఆ బాలుడు అన్నాడు. ఓ ప్రపంచమా..... ప్రపంచ దేశాలా మేల్కోండి. నిశ్శబ్ధపు దేశాలా మేల్కోండి. ప్రతిరోజూ సిరియా ప్రజలు కోల్పోతోందని ఆ బాలుడు వాపోయాడు. ప్రపంచ దేశాలు సిరియాలో ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నాడు. ప్రజలపై దాడులు జరగడం ఏమిటని.. తాము టెర్రరిస్టులమా అంటూ ప్రశ్నించాడు. టెర్రరిస్టులను వదిలిపెట్టి ప్రజలపై ఈ దాడులేంటి అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.