//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపి అనుసరిస్తున్న వ్యూహం ఇదే

Category : national politics

కర్ణాటక ఎన్నికల్లో అధికారం కోసం పాకులాడుతున్న బిజెపి బలపరిక్షను ఎలా అయినా ఎదుర్కొని గెలవాలని భావిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా యడ్యురప్ప ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో బిజెపి ఎలా గట్టెక్కుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక గవర్నర్ చెప్పిన విధంగా 15 రోజులు గడువు ఇవ్వని సుప్రీం ఎలాగైనా శనివారం దీనిలో విజయం సాధించాలని భావిస్తుంది. ఇందుకోసం నాలుగు వ్యూహాలను ఆ పార్టీ అమలు చెయ్యాలని భావిస్తుంది. ఒక్కసారి అవి చూస్తే.

వ్యూహం 1

బలపరీక్ష సమయంలో శాసనసభకు కనీసం 14 నుంచి 16 మంది జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యేలా చూడడం. ఇదే గనుక జరిగితే శాసనసభలో బలపరీక్షకు అవసరమైన మేజిక్‌ నంబర్‌ను సులభంగా చేజిక్కించుకోవచ్చు. అయితే దీని వల్ల అనర్హత ముప్పు కూడా ఉంది.

వ్యూహం 2

కాంగ్రెస్‌కు చెందిన 8 మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకొని వారితో క్రాస్‌ ఓటింగ్‌ చేయించవచ్చు. తద్వారా బలపరీక్షలో అవలీలగా గట్టెక్కొచ్చు. విప్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీకి ఓటేస్తే అనర్హత తప్పదు.

వ్యూహం 3

ఇప్పటికే తమ శిబిరంలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్‌, ప్రతా్‌పగౌడ పాటిల్‌లతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవచ్చు. శాసనసభలో బలపరీక్షకు అవసరమైన 111 మెజార్టీని సాధించే అవకాశం లభిస్తుంది. బీజేపీకి 104 మంది బలం ఉంది. ఇప్పటికే తమ శిబిరంలో ఉన్న ఇద్దరిని కలుపుకొంటే ఈ బలం 106కు పెరుగుతుంది. అంటే మేజిక్‌ నంబర్‌కు మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తోడైతే సరిపోతుంది.

వ్యూహం 4

ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నుంచి ఎమ్మెల్యేలు తమ వైపు రావడం సాధ్యం కాదని తేలిన పక్షంలో బలపరీక్షకు సిద్ధం కాకుండా 1996లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి లాగే యడ్యూరప్ప కూడా రాజీనామా సమర్పించడం. ఇలా చేయడం వల్ల తమకు ప్రజల్లో సానుభూతి పవనాలు వెల్లువెత్తుతాయని కమలనాథుల అంచనా.