Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్‌బాస్‌"ని ఊపేస్తోన్న ఈ కొత్త భామే టైటిల్ విన్నరా.?

Category : movies

"బిగ్‌బాస్‌" రియాలిటీ షో ఓ ఊపు ఊపేస్తోంది.హిందీలో సూపర్‌ సెన్సేషనల్‌ హిట్‌.తమిళంలోనూ దుమ్ము రేపుతోంది.ఇక తెలుగులోనూ అంతే.తెలుగులో కొత్త సీజన్‌ అతి త్వరలో మొదలు కాబోతోంది.తమిళంలో కొత్త సీజన్‌ ఇటీవలే స్టార్ట్‌ అయ్యింది.గత సీజన్‌లో హీరోయిన్‌ "ఒవియా" తిరుగులేని పాపులారిటీ సంపాదించింది.ఈ సీజన్లోఓ భామ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.అయితే,ఆమె ఇండియన్‌ కాదు.శ్రీలంక భామ పేరు "లోస్లియా మరియనేసన్‌".

ఓ న్యూస్‌ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేసిన లోస్లియా ప్రస్తుతం తమిళనాడులో ఒక హాటెస్ట్‌ సెన్సేషన్‌ అయిపోయింది.కొద్ది రోజుల్లోనే లోస్లియా ఇంత పాపులారిటీ తెచ్చుకోవడం అక్కడ చాలా మంది నమ్మలేక పోతున్నారు.తెలుగులో బిగ్‌బాస్‌ 2 విన్నర్‌ "కౌషల్‌ మండా"కి కౌషల్‌ ఆర్మీ ఎలాగైతే అనూహ్యంగా పుట్టుకొచ్చి సాయం చేసిందో ఇప్పుడు లోస్లియాదీ కూడా అదే పరిస్థితి.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో "లోస్లియా ఆర్మీ" చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు.

బిగ్‌బాస్‌ టైటిల్ విన్నర్‌ ఈమేనంటూ ఆల్రెడీ తమిళనాడులోని బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌ ఒక అంచనాకి వచ్చేశారు.హౌస్‌లో కొందరు పాపులర్‌ సెలబ్రిటీలున్నా,లోస్లియాకే అత్యధిక ఫాలోయింగ్‌ కనిపిస్తోంది.హౌస్‌ నుండి బయటికి వచ్చాక "లోస్లియా" తమిళ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిపోతుందని తమిళ సినీ జనాలు కూడా అభిప్రాయ పడుతున్నారు.మరో పక్క తెలుగులో మూడో సీజన్‌కి రంగం సిద్ధమవుతోంది.హోస్ట్‌గా "అక్కినేని నాగార్జున" రంగంలోకి దిగుతున్నారు.హౌస్‌ మేట్స్‌ ఎవరనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్‌ కొనసాగుతోంది.

Related News