//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నందమూరి సుహాసిని మెజారిటీ ఇదే ..!

Category : politics state

తెలంగాణ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యంఈవీఎం ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి రాష్ట్రంలో సుమారుగా 67.7% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది .

2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 % పోలింగ్‌ నమోదుకాగా ఈసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్‌ నమోదు కావచ్చునన్నారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియగా మిగిలిన 106 స్థానాల్లో 5 గంటలకు ముగిసింది.

ఈ ఎన్నికలు అన్ని పార్టీలు లు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . గెలుపే లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీలు కూడా దూసుకుపోయాయి . ప్రధానం గా ఈ ఎన్నికల్లో టీడీపీ , కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం పెద్ద విశేషం గా చెప్పాలి . ఈ ఎన్నికల్లో సీట్ల ప్రకటనలో కూడా చాలా ఆసక్తి కొనసాగింది . ఊహించని రీతిలో చివరి నిముషం లో చాలామంది కొత్తవారికి చోటు దక్కింది . పొత్తు లో భాగంగా గ్రేటర్ పరిధిలోని ప్రధాన సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది . దీనిపై అందరిలోనూ కొంతమేర అసంతృప్తి ఏర్పడిన కీలకనేతలు కలుగజేసుకొని , వారిని సముదాయించారు .

ఇక పొతే ఈ ఎన్నికల్లో ఎవరు ఊహించని వారు కూడా పోటీ లో నిలిచారు . అందులో ఒకరు నందమూరి సుహాసిని . ఈమె పేరు ని టీడీపీ అనూహ్య రీతి లో తెరపై కి తెచ్చింది. నామినేషన్స్ కి కొన్ని రోజుల సమయం ఉన్న తరుణం లో ఈమె పేరు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది . సుహాసిని రాజకీయాలకి కొంతైనా కూడా అని వర్గాల వారిని కలుపుకుంటూ పోతూ , కార్యకర్తలతోను , మహిళలతోను బాగా కలిసిపోయింది . అలాగే ఈమె తరుపున బాబాయ్ బాలకృష్ణ , మామయ్య చంద్రబాబు , తమ్ముడు తారకరత్న ఇంకా పలువురు నందమూరి వారసులు ప్రచారం లో పాల్గొన్నారు . అందరూ కూడా నందమూరి సుహాసిని గెలుపే లక్ష్యం గా చేసుకొని పని చేసారు . ముఖ్యంగా చంద్రబాబు ఆమెని గెలిపించేందుకు తన అనుభవాన్ని అంతా ఉపయోగించాడు . ఇక పొతే ప్రస్తుతం ఓటింగ్ కూడా ముగియడం తో నందమూరి సుహాసిని కూకట్ పల్లి లో దాదాపుగా 50 వేల ఫై చిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుపొందుతుంది అని అంచనా వేస్తున్నారు ...

Related News