//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టాలీవుడ్ లో 75 కోట్ల షేర్ వసూళ్లు సాధించిన టాప్ హీరోల లిస్ట్ ఇదే.....!

Category : movies

తెలుగు సినిమాల స్థాయి బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలతో పోటీ పడుతున్నప్పటికి. మన ఇండస్ట్రీలో ఏడాదికి 100 నుంచి 150 సినిమాలు రిలీజ్ అవుతు ఉండగా....అందులో 100 కు పైగా సినిమాలు చిన్న సినిమాలు కాగా...అందులో 20 నుంచి 50 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటున్నాయి. ఈ సినిమాల బడ్జెట్ వల్లఅటు నిర్మాతలకు ఇటు బయ్యర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.అందులో అడపా దడపా కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుసస్తున్నాయి. కేవలం ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలే టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆదుకుంటూ ఉన్నాయి.ఈ లెక్కన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న చిరంజీవి , వేంకటేష్ ,మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ,జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్, ప్రభాస్ లు మాత్రమే తమ సినిమాల ద్వారా భారీ వసూళ్ల ని సాధిస్తూ రికార్డులు సృస్టిస్తున్నారు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన కమ్ బ్యాక్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 సినిమా. 85 కోట్ల షేర్ తో , 164 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. ఇక మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్-2 దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూళ్లతో 70 కోట్ల షేర్ ని సాధించింది . ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది 180 కోట్ల గ్రాస్ వసూళ్ల తో 80 కోట్ల షేర్ ని వసూల్ చేసింది .మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి చిత్రాలు 75 కోట్లకు పైగా షేర్ వసూల్ సాధించాయి. రాంచరణ్ మగధీర , రంగస్థలం చిత్రాలతో 75 కోట్ల మార్క్ ని అధిగమించాడు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ , జైలవకుశ , అరవింద సమేత చిత్రాలతో 75 కోట్లకు పైగా షేర్ సాధించాడు.ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తె.... బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా తన మార్క్ సెట్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల వల్ల వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయాడు.ఇక పోతే ఈ లిస్ట్ లో సీనియర్ హీరోలు బాలయ్య , నాగార్జున వంటి వారు అసలే లేరు . అలాగే అల్లు అర్జున్ కూడా సరైనోడు చిత్రంతో ఈ మార్క్ ని ఇంచు మించు అందుకున్నాడు.