//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Category : politics

సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియో సాంగ్ ను ఎంపీ కవిత ఆవిష్కరించారు. టీఆర్ ఎస్ యూత్ వింగ్ రూపొందించిన ఈ వీడియో సాంగ్ సీడీని ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, ఈ వీడియో సాంగ్ ను రూపొందించిన టీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, కుత్బుల్లాపూర్ యువ నాయకులందరూ కలిసి మంచి పాటను రూపొందించారని అభినందించారు.

రాష్ట్రంలోని ప్రతి సంక్షేమం పథకం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టినవేనని, వాటన్నింటినీ చూపించే విధంగా ఈ పాటను రూపకల్పన చేశారని, సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఈ పాట కూడా ఓ కానుక అని, ఈ కానుక ప్రత్యేకంగా నిలవాలని, తమ యువ మిత్రులందరూ పడ్డ కష్టాన్ని కేసీఆర్ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత అన్నారు.

Related News