//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దొంగా.. దొంగా.. ఓవల్ గ్రౌండ్ లో మాల్యాకు పరాభవం

Category : business

బ‌్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్టి లండ‌న్ చెక్కేసి ముప్పతిప్పలు పెడుతున్న విజ‌య్ మాల్యాకు చేదు అనుభ‌వం ఎదురైంది. చాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లు చూస్తాన‌ని ఇప్ప‌టికే చెప్పిన మాల్యా ఆదివారం భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవర్‌ మైదానానికి వచ్చారు. 

ఈ సంద‌ర్భంగా అక్క‌డున్న భార‌త అభిమానులు అత‌న్ని చూడ‌గానే హేళ‌న చేశారు. దొంగా.. దొంగా.. అంటూ అరిచారు. దీంతో మాల్యాకు మొహం ఎక్క‌డ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో సైటర్లతో మాల్యాపై విరుచుకుపడుతున్న సామాన్య జనం నేరుగా ఆయనకు ఝలక్‌ ఇచ్చారు. 

ఊహించని పరిణామంలో మాల్యా ఒక్కసారిగా బిత్తరపోయారు. నీలం రంగు సూటులో మెరిసిపోతూ స్టేడియం లోపలికి వెళుతున్న మాల్యాను చూసి టీమిండియా ఫ్యాన్స్‌ ఒక్కసారిగా ‘దొంగ, దొంగ’ అంటూ కేకలు వేస్తూ ఆయనను చుట్టుముట్టారు. ఊహించని పరిణామంలో షాక్‌ తిన్న మాల్యా వడివడిగా స్టేడియం లోపలకు వెళ్లిపోయారు.

పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌ను చూసిన‌పుడే మాల్యాపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అత‌ను మ‌రింత రెచ్చిపోయి.. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లూ చూస్తాన‌ని అప్పుడే చెప్పాడు. అంతేకాదు కోహ్లి ఫౌండేష‌న్ నిర్వ‌హించిన చారిటీ డిన్న‌ర్‌కు కూడా మాల్యా వ‌చ్చాడు. అక్క‌డ కూడా ఇండియ‌న్ టీమ్ అత‌నికి మొహం చాటేసింది.