ఆఫ్ఘానిస్థాన్‌తో జూన్ లో జరిగే ఏకైక టెస్టుకు ఎమ్మె స్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన ఆటగాళ్లను ఎంపిక చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్‌కు చోటు దక్కింది. 26 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ శతకం బాదిన భారత ఆటగాడిగా నిలిచినా.. ఆ తర్వాత నిలకడ లేకపోవడంతో జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. జూన్ 14 నుంచి 18 వరకు బెంగళూరులో ఆఫ్ఘాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్‌తో టెస్టు సీరీస్ కి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు వీలుగా విరాట్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడబోతున్న నేపధ్యంలో అందుబాటులో ఉండడం లేదు.ఢిల్లీ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు బెర్త్ ఖాయమని అంతా భావించినా సెలెక్టర్లు కరుణ్‌పై నమ్మకముంచారు.ఈ టెస్ట్ కి టీం ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అలాగే ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల కోసం భారత జట్లను ప్రకటించారు. కోహ్లీ మినహా టెస్టు స్పెషలిస్టులంతా ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారు.
ఐపీఎల్లో పంజాబ్ తరపున దుమ్ము రేపుతున్న కేఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు. ఇక రహానె ఈ టెస్టుకే పరిమితమయ్యాడు. ఈ రంజీ సీజన్లో అతడు కర్ణాటక తరఫున 612 రన్స్ చేసి ఫా మ్ చాటుకున్నాడు. రోహిత్ శర్మకు జట్టులో స్థానం దక్కలేదు. వరుసగా విఫలమవుతున్న యువ స్పిన్నర్ చాహల్ స్థానం గల్లంతయ్యింది. భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా పేసర్ శార్దుల్‌కు చాన్స్ దక్కింది. ఇక ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సీరీస్ కి గాను అంబటి రాయుడుని జట్టుకి ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటి
ఒక్కసారి జట్టు చూస్తే
భారత జట్లు:
ఆఫ్ఘాన్‌తో టెస్టుకు
రహానె (కెప్టెన్), ధవన్, విజయ్, రాహుల్, పుజారా, కరుణ్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, ఉమేశ్ యాదవ్, షమి, హార్దిక్ పాండ్యా, ఇషాంత్, శార్దూల్ ఠాకూర్.
ఐర్లాండ్‌తో టీ20లకు
కోహ్ల్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్, రాహుల్, రైనా, మనీష్ పాండే, ధోనీ, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్, సుందర్, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, సిద్ధార్థ్ కౌల్, ఉమేశ్.
ఇంగ్లండ్‌తో టీ20లకు
కోహ్ల్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్, రాహుల్, రైనా, పాండే, ధోనీ, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్, సుందర్, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, కౌల్, ఉమేశ్.
ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు
కోహ్ల్లీ (కెప్టెన్), ధవన్, రోహిత్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రాయుడు, ధోనీ, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్, సుందర్, భువనేశ్వర్, బుమ్రా, పాండ్యా, కౌల్, ఉమేశ్.