//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాళ్ళిద్దరిని పట్టించింది సఫారి ఆటగాళ్లే

Category : sports

ఆస్ట్రేలియా గెలుపు కోసం ఆడిన ఒక డ్రామా ఇప్పుడు ఆ జట్టుని లాక్కోలేక పీక్కోలేక చేసింది. ఆ పని చేసింది ముగ్గురు ఆటగాళ్లే అయినా వారు చేసిన పని క్రికెట్ ఆస్ట్రేలియా పరువు తీసింది. అయితే వారిని పట్టించడం వెనుక సఫారి ఆటగాళ్ళు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సఫారి ఆటగాళ్ళు ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ళ ప్రవర్తనను గమనించారట. దానితోనే వారు అంత పక్కాగా కెమెరాలకు చిక్కారని తెలుస్తుంది.

పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్టు సందర్భంగా డేవిడ్‌ వార్నర్‌ ఎడమ చేతికి చాలా మందంగా టేపు చుట్టి ఉండడాన్ని సఫారి జట్టు స్టార్ ఆటగాడు డివిల్లీర్స్‌ గమనించాడు.వెంటనే ఈ విషయాన్ని అతడు తమ మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం సూపర్‌స్పోర్ట్‌ చానెల్‌కు వ్యాఖ్యాతగా ఉన్న గ్రేమ్‌ స్మిత్‌ దృష్టికి తీసుకెళ్ళడంతో... ఏదో జరుగుతోందని గమనించిన స్మిత్‌ తమ కెమెరామెన్‌ను అలర్ట్‌ చేశాడు.

బంతి ఆసీస్‌ ఫీల్డర్ల వద్దకు వెళ్లిన ప్రతిసారీ ఓ కన్నేసి ఉంచాలని సూచించాడు.దీనితో వారు పక్కాగా దొరికిపోయారు. మూడో టెస్టులో బాన్‌క్రాఫ్ట్‌ పకడ్బందీగా దొరకడానికి కారణమైంది. శాండ్‌పేపర్‌తో బంతిపై రుద్దడం.. ఆ తర్వాత వచ్చిన సూచనల మేరకు అతడు దాన్ని తన అండర్‌వేర్‌లో దాచడం అంతా వీడియోలో స్పష్టంగా కనపడింది. దీనితో వారిపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం కూడా విధించిన సంగతి తెలిసిందే. దీనిలో దోషులుగా తేలిన స్మిత్ , వార్నర్ పై ఏడాది నిషేధం విధించగా బ్యాన్క్రఫ్ట్ పై 9 నెలల నిషేధం విధించారు.