//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేకతలు ఇవే

Category : editorial

ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది ఏకంగా 61 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనుంది.మహాగణపతి చరిత్రలోనే ఇదే అత్యధిక ఎత్తైన విగ్రహం.వాస్తవానికి మహాగణపతి 60 అడుగులకు చేరిన తర్వాత ప్రతిఏటా ఒక్క అడుగు చొప్పున ఎత్తుతగ్గిస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ద్వాదశాదిత్య రూపంలో భారీ గణపతిని తయారు చేయనున్న నేపథ్యంలో ఎత్తు 61అడుగులు ఉండాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.ఈ మేరకు తుది నమూనాను కూడా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తదితరులు మంగళవారం విడుదల చేశారు.సూర్యుడు మనకు 12 రూపాల్లో కిరణాలు అందిస్తాడు.అందుకే సూర్యుడికి ద్వాదశాదిత్యుడని పేరు.ఆ 12 రకాల కిరణాలు చెడు ప్రభావం మనపై పడకుండా కాపాడేందుకు ద్వాదశాదిత్య మహాగణపతిగా నామకరణం చేశాం.

సూర్యుడు కూడా మహాగణపతి అధీనంలో ఉన్నాడని చెబుతూ.ఈ సంవత్సరం అతివృష్టి,అనావృష్టి లేకుండా వర్షాలు కురవాలని,నవగ్రహ,రాహుకేతు,శనేశ్వరుడు,కుజ గ్రహాల దుష్ప్రభావాల నుంచి ప్రజలను మహాగణపతి కాపాడాలని విగ్రహాన్ని ఈ రూపంలో తయారు చేయాలని నిర్ణయించాం అని దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ అన్నారు.వినాయకుడి ఎత్తు గతేడాది 56 అడుగులే ఉంది.కానీ ఈసారి వినాయకుడి తలపై మరొక తలను అదనంగా ఏర్పాటు చేయడం,దానిపై సూర్యభగవానుడి చక్రం,ఆపై 12 తలల పాములను ఏర్పాటు చేయడంతో గణపతి ఎత్తు 61 అడుగులకు చేరుకుంది అని శిల్పి రాజేంద్రన్‌ అన్నారు.ఇక ఈ మహాగణపతి విగ్రహం ప్రత్యేకతలు విషయానికి వస్తే ఈ మహాగణపతి పేరు ద్వాదశాదిత్య మహాగణపతి.

సూర్య భగవానుడి రథంపై 61 అడుగుల ఎత్తు,28 అడుగుల వెడల్పు,50 టన్నుల బరువు,12 ముఖాలు,24 చేతులు,12 సర్పాలు,7 అశ్వాలు ఈ విధమైన ఆకారంలో మహాగణపతి విగ్రహం ఉంటుంది.రథం లోపల కుడివైపు మహంకాళి,మహాసరస్వతి స్వరూపమైన సిద్ధకుంజికా దేవి 12 అడుగుల ఎత్తులో 3 ముఖాలు,6 చేతులతో ఉంటుంది. మరియు రథం లోపల ఎడమవైపు బ్రహ్మ,విష్ణు,మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయస్వామి 12 అడుగుల ఎత్తులోగోవుతో నిలబడి ఉంటారు.విగ్రహానికి కుడివైపు మహావిష్ణువుతో పాటు ఏకాదశి దేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి.విగ్రహానికి ఎడమవైపు త్రిమూర్తులతో దుర్గాదేవి విగ్రహాలు 16 అడుగుల ఎత్తులో ఉంటాయి.అలాగే షెడ్డు ఎత్తు 65 అడుగులు వెడల్పు 30 అడుగులుగా ఉంటుంది.