//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ బర్త్‌డే... ఆదివారం స్కూల్ కి రావాల్సిందే..!

Category : national

భారత ప్రధాని నరేంద్రమోడీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17. 1950లో జన్మించిన మోడీ 67వ ఏట అడుగు పెట్టనున్నారు. ఆ రోజు ఆదివారం. అయినా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలూ పని చేస్తాయనీ, విద్యార్థులు తప్పని సరిగా హాజరు కావాలని యూపీ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. యూపీలోని లక్షా 60 వేల పాఠశాలలో మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

మోడీ కోసం ఇలా పాఠశాలలను ఆదివారం తెరిపించనుండటం వివాదానికి దారి తీస్తోంది. స్కూళ్లు పనిచేసే రోజుల్లో జన్మదిన వేడుకలు జరిపితే పర్వాలేదు. ఇలా కావాలని ఏ ప్రధాని కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసిన దాఖలాలు లేవంటోంది మరోవైపు కాంగ్రెస్. ఎంతైనా మోడీ మీద ఉన్న మమకారాన్ని సి.ఎం యోగి ఆదిత్యనాధ్ ఇలా తీర్చుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఈ విషయం తెలిసి మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.