//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆపిలో అనేక ఆరోగ్యాలు...

Category : health

ఆపిల్ అంటే ఆరోగ్య నిలయం.....అలాంటి ఆపిల్‌ పండ్ల రసంలో యాలకులు, తేనె కలిపి తీసుకుంటూ ఉంటే కడుపులో మంట, పేగుల్లోని పూత, అజీర్తీ, కడుపు ఉబ్బరం, తేన్పులు, ఛాతీలో మంట తగ్గుతాయి.

రోజుకు మూడు ఆపిల్‌ పండ్లు తింటూ ఉంటే రక్తక్షీణత, శక్తిహీనతల సమస్య తొలగిపోతుంది.

ఆపిల్‌ పండ్లు ఏ ఆయాసమూ కలగకుండా మలబద్దకాన్ని నివారిస్తాయి. ఎంత మంచి ఆహారం తిన్నా, రోజురోజుకూ బలహీన పడుతున్న వాళ్లు, ఉదయం, సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున ఆపిల్‌ తింటే శరీరం బలంగా తయారవుతుంది.

రక్త-జిగురు విరేచనాలు అవుతున్నప్పుడు ఆపిల్‌ జూస్‌ తీసుకుంటే చాలా త్వరితంగా విరేచనాలు తగ్గుతాయి.

పసి పిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు కాస్తంత జ్యూస్‌ తాగితే ఆగిపోతాయి.

ఒక ఆపిల్‌లో ఒక మిల్లీ గ్రాము ఇనుము, 14 గ్రాముల ఫాస్పరస్‌, 10 మి.గ్రాముల క్యాల్షియంతో పాటు ఎ విటమిన్‌ ఉంటుంది.ఆపిల్ చూడటానికే కాదే శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తుంది.....మర్చిపోకుండా ఆపిల్ తినడం మరవొద్దు...