చైనాలోని పుతియాన్ ప్రాంతంలో ఓ దొంగ స్థానిక స్టోర్‌లో చోరీకి యత్నించాడు. ఉదయం 4 గంటలకు స్టోర్ యజమాని పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ దుకాణానికి ఉన్న షట్టర్‌కు ఆటోమెటిక్ రిమోట్ కంట్రోల్ ఉండటంతో యజమాని దాన్ని మూసివేయకుండానే వెళ్లిపోయాడు.
యజమాని అటు వెళ్లాడో లేదో ఓ దొంగ స్టోర్‌లోకి దూరేందుకు వచ్చాడు. అయితే షట్టర్ రిమోట్ కంట్రోల్ది అని తెలియని ఆ దొంగ లోనికి వెళ్లేందుకు యత్నించాడు. ఇంతలో స్టోర్ షట్టర్ దానంతట అదే కిందకు రావడం చూసి వెంటనే వెనక్కి వెళ్లబోయాడు. కానీ దురదృష్టవశాత్తు అతడి కాలు షట్టర్లో ఇరుక్కుపోయింది. కాలును బయటకు లాక్కునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఆ దొంగ ఇక చేసేదేం లేక తెల్లవారేదాకా అలాగే నేలపై పడుకున్నాడు.
ఉదయం స్టోర్ ముందు దొంగను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని రక్షించారు. ఈ ఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను స్థానిక మీడియా సోషల్‌మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. దురదృష్టం అంటే ఈ దొంగదే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.