//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పని మనిషిలా చేరిన ఆ యువతి...... ఎంతటి పాడు పని చేసిందో తెలుసా....?

Category : world

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన రోసీ బ్రౌన్ అనే మహిళ తన ఇంట్లో రెండు పెంపుడు కుక్కలను పెంచుకుంటోంది. అయితే తాను ఆఫీసుకి వెళ్లిన సమయంలో వాటి ఆలనా పాలనా చూసేందుకు ఓ పని మనిషిని ఓ యాప్ ద్వారా సంప్రదించి పనిలో పెట్టుకుంది. అందుకోసం ఆమె ఓ 26 ఏళ్ల బ్రింగ్లే ను తన కుక్కలను చూసుకునేందుకు పనిలో చేరింది. అందులో భాగంగా బ్రింగ్లే పెంపుడు కుక్కలను చాలా బాగా చూసుకుంటుందని, ఆ యాప్ లో పలువురు పలు రకాల రివ్యూలు కూడా పెట్టారు. దీంతో ఆకర్షితురాలైన యజమాని రోసి బ్రౌన్ వెంటనే ఆమెను సంప్రదించింది. డాగ్ సిట్టర్ పనికి బ్రింగ్లే సైతం తన ఆమోదం తెలిపింది. అయితే ప్రతిరోజు రోసీ తన ఆఫీసు వెళ్లగానే కుక్కలను అలా బయటికి తీసుకెళ్లడం, వాటికి స్నానం చేంచడం, సమయానికి పోషకాహారం పెట్టడం, మందులు వేయడం, వాటిని ఆడించడం బ్రింగ్లే చేయాల్సిన రోజు వారి దినచర్య.

అయితే రోసీ ఇంట్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసింది.తాను లేని సమయాల్లో ఇంట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న ఇట్టే తెలుసుకునేందుకు ఆ సీ.సీ కెమెరాలు ఆమె ఏర్పాటు చేసింది. అలాగే అందులో బ్రింగ్లే తన కుక్కలను సరిగ్గా చూసుకుంటుందో లేదో చెక్ చేసుకునేది. అయితే మొదట్లో బ్రింగ్లే వాటి ఆలనా పాలనా సరిగ్గానే చూసుకుంది. రోసీకి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో సీసీ కెమరా ఫుటేజీని గమనించడం కూడా మానేసింది. అయితే కొంత కాలానికి కుక్కలు తరచూ అనారోగ్యానికి గురవ్వడం. దీంతో బ్రింగ్లేపై రోసీకి అనుమానం కలిగింది. తాను ఇంట్లో లేని సమయంలో కుక్కలను సరిగ్గా చూడకుండా ఏం చేస్తుందో చూడాలని నిర్ణయం తీసుకుంది.

ఒక రోజు రోసీ తన ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజీ చూడగానే ఆమె దిమ్మ తిరిగే విషయం తెలిసింది. బ్రింగ్లే ఇంట్లో నగ్నంగా తిరుగుతూ కనిపించగా, సోఫాలో మరో యువకుడు ఉన్నాడు. అతనితో్ కలిసి బ్రింగ్లే శృంగారం చేస్తూ కనిపించింది. అయితే ఈ తతంగం ఎన్ని రోజుల నుంచి నడుస్తోంది. అని ఫుటేజీలో వెనక్కి వెళ్లి చూడగా, మరో బాయ్ ఫ్రెండ్ తో అదే సీన్ కనిపించింది. అలా రోజుకొక బాయ్ ఫ్రెండ్‌తో బ్రింగ్లే కనపడుతూ, రోసీ ఇంటిని లాడ్జిలా మార్చేసింది. దీంతో బ్రింగ్లే బయోడేటా ఏంటని ఆరా తీయగా, ఆమె ప్రొఫెషనల్ వేశ్య అని తేలింది. అంతేకాదు, రోసీ ఇంట్లో లేని సమయంలో విటులను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా పనిచేయడం ప్రారంభించింది. అయితే ఈ తతంగానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన రోసీ, పోలీసులను ఆశ్రయించి బ్రింగ్లేను ఆమె బాయ్ ఫ్రెండ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. రోసీ అనుమతి లేకుండా ఆ ఇంటిని వాడుకున్నందుకుగానూ బ్రింగ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు.