ఉగ్రవాదానికి, అరాచకానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో ప్రపంచం సిగ్గుతో తలదించుకునే ఘటన జరిగింది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ప్రావిన్స్‌లోని గిరిజన చట్టాలకు సమాంతరంగా నడిచే గ్రామీణ చట్టాలు విధిస్తున్న శిక్షలు ఇటీవల చాలా కఠినంగా మారాయి. ‘పరువు’ పేరుతో ప్రతి ఏడాది వందలాది మంది మహిళల ప్రాణాలను ఈ చట్టాలు తీసేస్తున్నాయి.మహిళతో ఓ యువకుడు అసంబద్ద సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఆ యువకుడి సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించి బదులు తీర్చుకున్నారు.
తాజా ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. యువకుడి 14 ఏళ్ల సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని విలేజ్ కౌన్సిల్ తీర్పు చెప్పింది.
అక్టోబరు 27న బాలికకు స్థానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా తిప్పుతూ ఊరేగించారు. దేశంలో ఈ ఘటన ప్రకంపనలు సృష్టించడంతో స్పందించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.