Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విలన్ అవ్వాలని వచ్చాను కమెడియన్ అయ్యాను - ప్రియదర్శి

Category : movies

ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో ప్రియదర్శి కూడా ఒకరు.మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఆయన, వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.నాకు విలనిజం అంటే ఇష్టం.అందువలన విలన్ పాత్రల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎప్పటికైనాఒక కోట శ్రీనివాసరావు..ఒక ప్రకాశ్ రాజ్ స్థాయికి వెళ్లాలని అనుకునేవాడిని.

ఈ కారణంగానే "టెర్రర్","బొమ్మల రామారం" లాంటి సినిమాల్లో విలన్ గా నటించాను.ఆ సినిమాలు నాకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు ఆ తరువాత అవకాశాలు ఏమీ రాలేదు.దాంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండగా "పెళ్లి చూపులు" సినిమాలో అవకాశం వచ్చింది. ఏదో ఒకటిలే ముందు ఫుడ్డు దొరుకుతుందని కదా అని చేశాను.కానీ ఆ పాత్రే నా కెరియర్ ను మలుపు తిప్పింది.నన్ను కమెడియన్ ను చేసి ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది అని చెప్పుకొచ్చాడు.