//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాది హతం

Category : national

జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక తీవ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్‌కు 120 కిలోమీటర్లు దూరంలో వున్న లంగట్‌ ప్రాంతంలో తీవ్రవాదులు వున్నారనే సమాచారంతో అక్కడకు చేరుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. భద్రతా బలగాలు తమ కోసం గాలిస్తున్నారన్న సంగతి తెలుసుకున్న తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రవాది హతమయ్యాడు. మృతి చెందిన తీవ్రవాది నుంచి ఒక గ్రెనైడ్‌, రైఫిల్‌, పాకిస్తాన్‌ కరెన్సీని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకే ఈ కాల్పులు ప్రారంభమైనట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కన్నెల్‌ రాజేష్‌ కలియా తెలిపారు.