Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

" జైసేన " విజయం మీ చేతుల్లోనే ఉంది...పవన్ ఫ్యాన్స్ నే నమ్ముకున్న చిత్ర యూనిట్.

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ఊహించని ఓటమి చవి చూసిన జనసేన.ఈ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పూర్తి స్థాయిలో తన ప్రాబల్యాన్ని కోల్పోయిందనే చెప్పాలి. ఎన్నికల ముందు నెలకొన్న అంచలనాలను అందుకోలేక ఇంత దారుణమైన ఫలితాలు ఎదుర్కోవడం.....వెనుక అసలు కారణాలు వెతికే ప్రయత్నంలో పడింది జనసేన. ఇదే విషయం పై తన టీం తో కలిసి పూర్తి స్థాయి లోతుల్ని విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా జనసేన ఆలోచనా శైలి రాజకీయ లక్ష్యాలను ఉద్దేశించి ఓ సీనియర్ దర్శకుడు వి. సముద్ర ఇటీవలే ఓ చిత్రాన్ని తీసి విడుదలకు సిద్దం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా టైటిల్ " జైసేన" అని పెట్టారు.

ఈ సందర్భంగా నిన్న ఓ ఈవెంట్ కూడా చేశారు ఈ చిత్ర యూనిట్.అంతే కాకుండా ఈ పేరుతో ఓ సినిమా వస్తోందని ఇప్పటికే ప్రేక్షకులకూ తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని అంతర్లీనంగా తీసుకుని జనసేన ఐడియాలజీని తెరమీద చూపించే ప్రయత్నమే జైసేన అని ఈ చిత్ర దర్శకుడు స్పష్టం చేశారు. ఇందులో అసలు విశేషం ఏమిటి అంటే శ్రీకాంత్, సునీల్ హీరోలుగా నటించడం.వీళ్ళతో పాటు మరో నలుగురు కుర్రాళ్ళు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న జైసేనలో వైసిపి ప్రచారంలో పాల్గొన్న పృథ్వి కూడా ఉండటం విశేషం.అయితే ఈ సినిమా ఎన్నికలకు ముందే తీసిందని అర్థమవుతోంది.

మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన గెలుస్తుందనో ... లేదా ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పబోతుందనో.... ముందస్తు అంచనాతో ఈ సినిమా ప్లాన్ చేసారేమో. కాని ఇప్పుడు అలాంటి అనుకూలతలకు తావు లేదు.ఈ నేపధ్యంలోనే సో జైసేనను ఆదరించాల్సింది ముఖ్యంగా పవన్ అభిమానులే. ఎలాగూ తమ హీరో సినిమాలు చేసే ప్రసక్తే లేదంటున్నాడు కాబట్టి ఈ రకంగా జనసేనకు మద్దతు ఇచ్చే సినిమాలకు అండగా ఉండాలను ఈ చిత్ర బృందం కోరుకోవడం గమనార్హం. త్వరలో విడుదల కానున్న జైసేన టైటిల్ లోగో అన్ని రాజకీయంగానే ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి ఎంతవరకు దీనికి ఫాన్స్ సపోర్ట్ దక్కుతుంది అనే దాన్ని బట్టి ఈ సినిమా విజయం ఆధారపడి ఉంది.