//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముఖేష్ అంబానీ ఉచిత జియో ఫోన్లు వెనుక రహస్యం

Category : business

ముకేశ్ అంబానీ రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రకటించగానే, జనమంతా ఆశ్చర్యపోయారు. పాపం అంబానీ గారు మన కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నాడురా అన్నంత రేంజ్ లో కుర్రాళ్లంతా చాలా ఇదైపోయారు. అయితే, అంబానీ అనే మనిషి ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఏం చేసినా దాని వెనక తప్పనిసరిగా లాజిక్ ఉంటుంది. రూ. 1500 కడితే ఒక ఫోన్. మూడేళ్ల తర్వాత ఆ డబ్బు వాపస్. ఇక అన్ లిమిటెడ్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్. ఆహా…వినడానికి ఎంత బాగుంది అనిపిస్తోందా..? ఇప్పుడు కాస్త లోతుగా వెళ్దాం రండి.

ముందుగా మనం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి.

మనలో ఎవరైనా రెండేళ్లకు మించి ఏ ఫోన్ అయినా వాడుతున్నామా..?
ఎప్పుడో మూడేళ్ల తర్వాత రూ.1500 వెనక్కి కావాలని ఎంతమంది అనుకుంటారు..?
అసలు క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే రూ. 1500 కట్టి ఫోన్ తీసుకుంటున్నాం అని గమనించారా..?
మూడేళ్ల తర్వాత ఈ ఫోన్ అసలు మీ దగ్గర ఉంటుందా..?
బ్యాటరీ బయటికి తీయడానికి కుదరదు. మరి మూడేళ్లలో బ్యాటరీ పోతే..?
వర్కింగ్ కండీషన్లోనే తిరిగివ్వాలనేది రూల్. మరి ఫోన్ ను అంత నీట్ గా ఎంతమంది తిరిగిస్తారు..?

ఈ ప్రశ్నలు చదవగానే, మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. అంబానీ వారు మనకు 1500 రూపాయలు తిరిగి ఇవ్వడానికి స్కోప్ చాలా తక్కువ అని. ఎమౌంట్ తక్కువ కావడం, మూడేళ్లు చాలా ఎక్కువ సమయం కావడంతో, 99.9 శాతం జనాలు లైట్ తీసుకుంటారు. ఆ ఎమౌంట్ కూడా కోల్పోకూడదని భావించిన ఆ 0.01 శాతం జనాల్లో ఎంత మంది ఫోన్స్ ఏ రిపెయిర్ లేకుండా పనిచేస్తాయో తెలీదు. ఒక్కమాటలో చెప్పాలంటే, 1500 రూపాయల ఫోన్ ను అంబానీ అమ్ముతున్నాడు. అంతే. ఇందులో డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం దాదాపు శూన్యం. ఇక అది కాకుండా నెలనెలా రీఛార్జ్ లు తప్పనిసరిగా వేసుకోవాలి. మిగిలిన నెట్ వర్క్స్ లాగే ఇది కూడా. అన్నట్టు ఇక్కడ ఇంకో మడత ఉందండోయ్. కనీసం మూడు నెలలకోసారి రీఛార్జ్ చేసుకోకపోతే, కనెక్షన్ కట్ అయిపోతుంది.

అర్ధమైందా అంబానీ తెలివి..? ఇక లెక్కలు ఒక్కసారి వేస్తే,

తక్కువలో తక్కువగా దేశవ్యాప్తంగా ఒక యాభై లక్షల కొత్త కనెక్షన్స్ జియోకు వచ్చాయనుకుందాం. ఒక్కో కనెక్షన్ కు రూ.1500 చొప్పున చూస్తే, మొత్తం 750 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఫోన్స్ అమ్ముడవగా వచ్చిన మొత్తం మాత్రమే. ఆ తర్వాత నెలనెలా వచ్చే రిఛార్జ్ లను కలుపుకుంటే, మూడేళ్లలో వేలకోట్లలోకి టర్నోవర్ చేరుతుంది. అది కాక మరింతగా పెరుగుతూ పోయే షేర్ వేల్యూ, కంపెనీ బ్రాండ్ నేమ్, మరింత మంది కొత్త కస్టమర్స్. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే, శ్రీ రిలయన్స్ సంస్థ వారు మనకు సదరు ఆఫర్ ఇచ్చారన్నమాట.