//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సాఫ్ట్ వేర్ జాబ్ కి అవసరమైన స్కిల్స్ మీకున్నాయా ?

Category : business state national

నేడు ప్రపంచం అంతా వినిపిస్తున్న కాస్ట్ కటింగ్, వీసాల నిరాకరణ సాఫ్ట్ వేర్ రంగాన్ని, ఆ ఉద్యోగులను నైరాశ్యంలో ముంచెత్తుతోంది. ఎన్నో దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటికి పంపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరోప్రక్క అమెరికా వెళ్లాలనుకునే డాలర్ ప్రేమికులకి ట్రంప్ రూపంలో చిక్కులు వచ్చిపడ్డాయి. అయితే వీటన్నింటిని భారతీయ పరిశ్రమ ఎప్పటికప్పుడు పరిష్కారాలు కనుగొంటునే ఉంటుంది. మన ఐటీ మేధావులు ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సదా ఎల్లపుడూ సన్నద్దంగానే ఉంటారు. ఐటీలో ఆటోమేషన్, అందరికి గుబులు రేపుతున్న తమ కంపెనీ ఉద్యోగులకు మరిన్ని స్కిల్స్ డెవలప్ మెంట్ ఫై దృష్టి సారించాయి దిగ్గజ కంపెనీలు. ప్రపంచ స్థాయి వినియోగదారులను సంతృప్తి పరిచేందుకు కంపెనీలు తమ ఉద్యోగులను నైపుణ్య బాట పట్టిస్తున్నాయి. ప్రస్తతం డాటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కు మంచి డిమాండ్ ఉండటంతో కంపెనీలు తమ ఉద్యోగులకు వాటిపై తర్ఫీదునివ్వడం మొదలుపెట్టాయి. మరోవైపు కాలానుగుణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఆ ఉద్యోగం కావాలనుకునేవారు కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల పైన, బిగ్ డాటా అనాలసిస్ పై దృష్టి సారిస్తున్నారు. కంపెనీల భవిష్యత్తు నేడు పూర్తిగా ఆ సంస్థ ఉద్యోగుల స్కిల్స్ పైనే ఆధారపడి ఉంది.

అందుకే అటు సంస్థతో పాటు, ఇటు ఉద్యోగులు తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి విస్తృత నైపుణ్యాలకై తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాయి. ఒకటికన్నా ఎక్కువ నైపుణ్యాలు కలిగి ఉండటం సాఫ్ట్ వేర్ లో ఉద్యోగిగా కొనసాగడానికి నేటి పరిస్థితుల్లో చాలా అవసరం. బిజినెస్ అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ స్కిల్స్ వచ్చిన వారికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. స్పార్క్, AWS (అమెజాన్ వెబ్ సర్వీస్), Devops, మెషిన్ లెర్నింగ్, Azura, Tableau, బిజినెస్ ఎనలటిక్స్, సేల్స్ ఫోర్స్, జిరా, సెలెనియూమ్ కోర్సులకు నేడు బాగా డిమాండ్ పెరుగుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, నిత్యనూతన విద్యార్థులు అన్న నానుడి ఇందుకే వచ్చింది కాబోలు.