Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్లేఆఫ్స్‌కు పక్కా ప్రణాళిక......సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌

Category : sports

నిన్నటి తో ఐపీయల్ లో ఒక శకం ముగిసింది.ప్లే ఆఫ్ కి చేరిన నాలుగు జట్లు ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి. ఈసారి పక్కా ప్రణాళికతో ప్లేఆఫ్స్‌లో బరిలో దిగుతామని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. గెలుపు బాట పట్టడానికి కొన్ని మార్పులు తప్పవని సంకేతాలిచ్చాడు.

శనివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమకంటే మెరుగ్గా ఆడిందని తెలిపాడు. లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ‘కోల్‌కతాతో మ్యాచ్‌లో 200 పరుగులు సాధించాలని అనుకున్నాం. ఐతే మా నుంచి కొన్ని పొరపాట్లు జరిగాయి. కోల్‌కతా అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకుంది.

మరో మంచి భాగస్వామ్యం నమోదు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్ళు బాగానే ఆడారు. కానీ కోల్‌కతా మాకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఇప్పుడిక ప్లేఆఫ్స్‌ సమయం. మా బలాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాం. ప్లేఆఫ్స్‌లో పక్కా ప్రణాళికతో బరిలో దిగుతాం. గెలుపు బాట పట్టడానికి కొన్ని మార్పులు తప్పనిసరి అని విలియమ్సన్‌ చెప్పాడు.