//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకొని...... "ఆర్.ఆర్.ఆర్" ఓవర్ సీస్ బిజినెస్ ఎంతో తెలుసా .....?

Category : movies

దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఆక్షన్ చిత్రం "ఆర్.ఆర్.ఆర్". బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అంతే కాకుండా ఇప్పటి తరంలో ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కావడం అందులో ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్....మరో పక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తూ ఉండడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం.అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క టాలీవుడ్ ప్రేక్షకుడి చూపంతా "ఆర్ఆర్ఆర్" పైనే ఉంది. అందుకే ఇన్ని భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకోక్క వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని అనుకున్న సమయానికల్లా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ చిత్ర బృందం.

ఈ నేపధ్యంలోనే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న "ఆర్ఆర్ఆర్" సినిమా ఓవ‌ర్‌సీస్ బిజినెస్ పై తాజాగా ఓ వార్త టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.కనీ వినీ ఎరుగని హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ సొంతం చేసుకోవడానికి బయ్యర్స్ చాలా ఆసక్తి చూపుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ బిజినెస్ క్లోజ్ చేశారనే సమాచారం కూడా అందుతుంది. ఈ సినిమా నిర్మాణం పూర్తి కాక‌ముందే ఇంత భారీ క్రేజ్ రావడంతో ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ రైట్స్ కోసం ఏకంగా 60 కోట్ల‌ కు పైగా చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని దుబాయ్ కి చెందిన ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పేర్కొన్నది. అన్ని భాష‌ల‌కు సంబంధించిన ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను ఈ సంస్థ చేజిక్కించుకుందని తాజా సమాచారం. కాకపోతే ఒక్క చైనా రైట్స్ మాత్రం వఈ సంస్థకు దక్కలేదని తెలుస్తోంది. ఈ మేర డీల్ జరగడమంటే మామూలు విషయం కాదు. ఇది తెలిసి టాలీవుడ్ ప్రేక్షకులు రిలీజ్ కి ముందే ఈ స్థాయిలో మార్కెట్ జరుగుతూ ఉండడం చూసి అంతా షాకవుతున్నారు.

సుమారు 400 కోట్ల భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా హైద‌రాబాద్‌ శివారు ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా పలువురు నటీనటులు పాల్గొంటున్నారు. చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. ఈ సీన్ షూటింగ్ నీ మరికొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేయనున్నారట. జ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా ఆలియా భట్... ఎన్టీఆర్ కి జోడీగా నటించే హీరోయిన్ కోసం ఇంకా చిత్రయూనిట్ అన్వేషణలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌చ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ఈ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.